Sri Lanka Crisis : ఇంధన కొరతతో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత

శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.

Sri Lanka Crisis : ఇంధన కొరతతో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత

Sri Lanka Crisis

Sri Lanka Crisis :  శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్దు డబ్బాలతో ప్రజలు రోజుల కోద్దీ పడిగాపుల కాసే పరిస్ధితి కొనసాగుతోంది. ఇంధన  కొరత తీవ్రమైన నేపధ్యంలో చర్యలు చేపట్టిన శ్రీలంక ప్రభుత్వం అక్కడ పాఠశాలలను తాత్కాలికంగా మూసి వేసింది.

అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు రావద్దని సూచించింది. దీనితో పాటు ప్రవేట్ పాఠశాలలకు కూడా శుక్రవారం నాడు మూసివేయాలని ఆదేశించింది. అయితే ఇవి ఎప్పటి వరకు కొనసాగుతాయనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు దేశంలో ఒక  రోజుకు సరిపడా మాత్రమే పెట్రోల్ నిల్వలు ఉన్నట్లు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే ప్రకటించారు. అయితే పెట్రోల్ తో పాటు ఇతర ఇంధనాల కొరత కూడా  శ్రీలంకను  వేధిస్తోంది. వీటికోసం ప్రజలు రోజుల తరబడి వేచి ఉండటంతో అక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇంధన దిగుమతికి డాలర్లు లేకపోవటంతో అంతర్జాతీయ సంస్ధలు, విదేశీ సహాయం కోసం శ్రీలంక ప్రభుత్వం ఎదురు చూస్తోంది.
Also Read : Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్‌ స్టైల్‌లో అమెరికాలోనూ టీ20 లీగ్

ఇవన్నీ ఇలా ఉంటే దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోంటోంది. గడిచిన 70 ఏళ్లలో తొలిసారి రుణాలను కూడా ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల రూణానికి సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా ముగిసి పోవటంతో అధికారికంగా ఎగ్గోట్టినట్టైంది.  ఈ విషయాన్ని క్రెడిట్ ఏజెన్సీలు ధృవీకరించాయి. కాగా ప్రస్తుతం  దేశం ముందస్తు దివాళాలో ఉందని ఆ దేశ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నందలాల్ తెలిపారు.