Afghanistan : అణగదొక్కుడు షురూ..! మ్యూజిక్,టీవీ,రేడియోల్లో మహిళల వాయిస్ బంద్
తాము పూర్తిగా మారిపోయాం..ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు..మహిళలు చదువుకోవచ్చు..మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో

Afghan25 (1)
Afghanistan తాము పూర్తిగా మారిపోయాం..ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు..మహిళలు చదువుకోవచ్చు..మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో నొక్కి మరీ చెబుతున్న తాలిబన్ నేతలు…ఆచరణలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు ఏ మాత్రం మారలేదని ప్రస్తుత వారి చర్యలు సృష్టం చేస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే తాలిబన్ నేతలు వ్యవహరిస్తున్నారు.
మ్యూజిక్ లేదా పాటలు మరియు టీవీల్లో మరియు రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్ ని బ్యాన్ చేయాలని కాందహార్ లోని టీవీ ఛానళ్లు మరియు రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. కాగా, ఆగస్టు-15న తాలిబన్లు అప్ఘానిస్తాన్ ని తమ కంట్రోల్ లోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్(ఆడవాళ్లు)యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం. మరోవైపు,అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని ఇప్పటికే తాలిబన్ ప్రకటించింది.
కాగా,1996-2001 మధ్య అప్ఘానిస్తాన్ లో తాలిబన్ అధికారంలో ఉన్న సమయంలో..మహిళల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. తమ పాలన సమయంలో మహిళల విద్య, క్రీడలు, సంగీతం మొదలైన వాటిని తాలిబాన్ పూర్తిగా నిషేధించింది. అదేవిధంగా స్త్రీలు రోడ్డు మీద లేదా ఎక్కడా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. తాలిబాన్ పాలనలో గరిష్టంగా మహిళ మరణాలే ఎక్కువగా జరిగినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.
అయితే 9/11 దాడుల అనంతరం అమెరికన్ బలగాలు అఫ్ఘాన్ రావడంతో మహిళల్లో కొంత ఊరట లభించడంతోపాటు బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే హక్కు లభించిందని ప్రజలు సంబురపడ్డారు. అయితే తాలిబన్ తో శాంతి ఒప్పందంలో భాగంగా ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా,నాటో బలగాలు పూర్తిగా వైదొలుగుతున్న క్రమంలో మళ్లీ అక్కడి మహిళల్లో ఆందోళన మొదలైంది. అందుకే గత కొద్ది రోజులుగా అప్ఘానిస్తాన్ వదిలి పారిపోతున్నవారిలో ఎక్కువమంది మహిళలు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
READTaliban : ఆప్ఘానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్ నిషేధిస్తూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు
READTaslimaNasreen:మహిళల్నిసెక్స్ బానిసలుగా,పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చేస్తారు