Afghanistan: అఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న వేళ తాలిబన్ల సంచలన నిర్ణయం.. కొత్త ప్లాన్‌తో ముందుకు

2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింది. చాలా మంది ప్రజలు తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్నారు.

Afghanistan: అఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న వేళ తాలిబన్ల సంచలన నిర్ణయం.. కొత్త ప్లాన్‌తో ముందుకు

Afghanistan: తాలిబన్ల రాజ్యంలో అఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిన సంగతి తెలిసిందే. 2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది.

Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో

పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింది. చాలా మంది ప్రజలు తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు దృష్టిపెట్టిన తాలిబన్లు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. గతంలో అమెరికాతోపాటు విదేశీ దళాలు ఉపయోగించుకున్న మిలిటరీ బేస్‌లను ప్రత్యేక ఆర్థిక జోన్‌లుగా మార్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం.. ఈ ఆర్థిక జోన్లలో వ్యాపారాలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు అక్కడ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ పీఎం ప్రతిపాదన చేశారు. దీనిపై ప్రధాని ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ఆధ్వర్యంలోని కమిటీ ఒక నివేదిక రూపొందించింది.

Uttar Pradesh: యాత్ర చేస్తున్న శివ భక్తులకు బీర్లు పంచిన వ్యక్తి.. అరెస్టు చేసిన పోలీసులు

దీన్ని క్యాబినెట్ ఆమోదానికి పంపి నిర్ణయం తీసుకుంటారు. రాజధాని కాబూల్‌తోపాటు బల్క్ ప్రావిన్స్‌లో ఆర్థిక జోన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అనేక సంస్థలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయం అఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఊతానికి దోహద పడుతుందని అక్కడి తాలిబన్లు భావిస్తున్నారు. అక్కడ దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థపై నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ఆర్థిక, మానవ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం సమృద్ధిగా ఎదగాలని తాలిబన్లు నిర్ణయించారు.