Civilians Moon : జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లే క్రూయిజర్‌ వాహనం

లూనార్‌ ‍క్రూయిజర్‌ వెహికల్‌ చంద్రుడి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని టయోటా హామీ ఇస్తోంది.

Civilians Moon : జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లే క్రూయిజర్‌ వాహనం

Moon (2)

Updated On : January 29, 2022 / 9:55 AM IST

Toyota cruiser vehicle : జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లేలా ఓ క్రూయిజర్‌ వెహికల్‌ని తయరుచేసే పనిలో టయోటా ఉంది. జపాన్‌ ఎయిరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీతో జాయింట్‌ వెంచర్‌గా ఈ లూనార్‌ క్రూయిజర్‌ వెహికల్‌ని అభివృద్ధి చేస్తోంది. 2030 చివరి నాటికి వాహనం సిద్ధమవుతుందని టయోటా అంటోంది. అంతేకాదు 2040 కల్లా మార్స్‌ మీదికి కూడా వెళ్లవచ్చని చెబుతోంది.

తాము అభివృద్ధి చేసే లూనార్‌ ‍క్రూయిజర్‌ వెహికల్‌ చంద్రుడి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని టయోటా హామీ ఇస్తోంది. లూనార్‌ లాండ్‌ ‍క్రూయిజర్‌లోనే చంద్రుడిపై తిరిగేందుకు, తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.

Boy Addict PUBG : పబ్‌ జీకి బానిసై నలుగురు కుటుంబసభ్యులను కాల్చిచంపిన బాలుడు

స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం తాము అదే తరహా టెక్నాలజీపై పని చేస్తున్నట్టు టయోటా చెబుతోంది. భూమిపై వాహనాల్లో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు చేయించాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది.