Twitter: ట్విట‌ర్ కొనుగోలు ఒప్పందం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఎలాన్ మస్క్ ప్ర‌క‌ట‌న‌.. స్పందించిన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే, ట్విట‌ర్‌తో ఎలాన్ మ‌స్క్‌ కొనుగోలు ఒప్పందం ముందుకు క‌ద‌ల‌ట్లేదు.

Twitter: ట్విట‌ర్ కొనుగోలు ఒప్పందం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఎలాన్ మస్క్ ప్ర‌క‌ట‌న‌.. స్పందించిన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌

Billionaire Elon Musk Now Has 100 Million Followers On Twitter (1)

Twitter: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే, ట్విట‌ర్‌తో ఎలాన్ మ‌స్క్‌ కొనుగోలు ఒప్పందం ముందుకు క‌ద‌ల‌ట్లేదు. తాజాగా, ఈ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాన్ మ‌స్క్‌ ప్రకటించి షాక్ ఇచ్చారు. విలీన ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ట్విటర్‌ ఉల్లంఘించిందని ఎలాన్ మ‌స్క్ ఆరోపిస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. స్పామ్ అకౌంట్ల‌కు సంబంధించి ట్విటర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆయ‌న చెప్పారు. ట్విట‌ర్‌లో 5 శాతం కంటే తక్కువగా అటువంటి ఖాతాలు ఉన్నట్లు ఆ కంపెనీ త‌మ‌కు తెలిపింద‌ని, అయితే, అందుకు స‌రైన‌ ఆధారాలను చూపించలేద‌ని ఆయ‌న అంటున్నారు.

vijaya sai reddy: షర్మిలమ్మ పార్టీ కోసం విజయమ్మ వెళ్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

స్పామ్‌ ఖాతాలు 20 శాతం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెబుతున్నారు. 5 శాతం మాత్ర‌మే స్పామ్ ఖాతాలు ఉన్న‌ట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు ట్విట‌ర్ ఇచ్చిన సమాచారం స‌రైన‌దేన‌ని తాను మొద‌ట అనుకున్నాన‌ని ఆయ‌న ఇంత‌కు ముందు తెలిపారు. స‌రైన స‌మాచారం ఇచ్చాకే ఒప్పందం విష‌యంలో ముందుకు వెళ్తామ‌ని ఆయ‌న కొన్ని రోజులుగా చెబుతున్నారు. ట్విట్ట‌ర్ నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతోనే ఆయ‌న ఒప్పందం నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ట్విట‌ర్ సంస్థ త‌మ‌కు స‌రైన స‌మాచారం అందించ‌డం లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్‌ కమిషన్ (ఎస్ఈసీ) కు తెలిపారు. అయితే, ఎలాన్ మ‌స్క్ తీరుపై ట్విటర్‌ ఛైర్మన్‌ బ్రెట్ టేల‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎలాన్ మ‌స్క్ త‌మ‌తో చేసుకున్న‌ ఒప్పందం విష‌యంలో త‌మ‌ బోర్డు చట్టపరంగా ముందుకు వెళ్ళాల‌నుకుంటోంద‌ని చెప్పారు. ఒప్పందాన్ని నిబంధనల ప్రకారమే రద్దు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు. మస్క్ ఒప్పందం ప్ర‌క్రారం లావాదేవీల ప్రక్రియ‌ను ముగించ‌క‌పోతే జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది.