Ukrainian Army : యుక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన.. రష్యా యుద్ధాన్ని విరమించేది ఆ రోజే..?!

Ukrainian Army : యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగడం లేదు. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులను అంతే స్థాయిలో యుక్రెయిన్ ఆర్మీ తిప్పికొడుతోంది.

Ukrainian Army : యుక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన.. రష్యా యుద్ధాన్ని విరమించేది ఆ రోజే..?!

Ukrainian Army Claims Russia Wants To End War By May 9 Report

Updated On : March 25, 2022 / 5:11 PM IST

Ukrainian Army : యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగడం లేదు. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులను అంతే స్థాయిలో యుక్రెయిన్ ఆర్మీ తిప్పికొడుతోంది. నెల రోజులుగా యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలై నేటికి (శుక్రవారం) 31వ రోజు అవుతుంది. ఒకవైపు బాంబులతో దాడులు చేస్తూనే మరోవైపు ఇరుదేశాలు శాంతి చర్చల్లో పాల్గొంటున్నాయి. అయినప్పటికీ చర్చలతో ఫలితం శూన్యమే.. యుద్ధంలో ఇప్పటికే రష్యా ఆర్మీ అధికారులతో పాటు సైనిక సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చింది. యుక్రెయిన్ కూడా యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం భారీగా వాటిల్లింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌ ఆర్మీ ఒక సంచలన ప్రకటన జారీ చేసింది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఎప్పుడు మగిస్తుందో యుక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. రష్యా యుద్ధాన్ని విరమించే తేదీ ఎప్పుడో యుక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది.

వచ్చే మే 9న యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించాలని రష్యా భావిస్తోందని యుక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా మే 9వ తేదీన యుద్ధాన్ని విరమించాలనుకుంటుంది? అంటే.. రష్యాకు ఆ రోజున ఒక ప్రత్యేకత ఉందని నివేదికలు చెబుతున్నాయి. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా మే 9న రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటుంది. సరిగ్గా అదే రోజున యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించడంపై అధికారిక ప్రకటనను రష్యా ఆర్మీ జారీ చేసే అవకాశం ఉందని యుక్రెయిన్ ఆర్మీ అంచనా వేస్తోంది.

Ukrainian Army Claims Russia Wants To End War By May 9 Report (1)

Ukrainian Army Claims Russia Wants To End War By May 9 Report 

ఇంతకీ విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే హాలీడేగా చెబుతారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు, నాటో సభ్య దేశాలు ఎంతగా వారించినా రష్యా అధ్యక్షుడు యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాడు. యుక్రెయిన్ హస్తగతమే లక్ష్యంగా రష్యా బలగాలను మరింత మోహరించేలా ఆదేశాలిచ్చాడు. కానీ, ఇప్పుడు రష్యా తనంతట తానే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందని, అందుకు సరైన సమయం మే 9గా నిర్ణయించిందనే నివేదికలు వెల్లడించాయి.

మరోవైపు.. రష్యా తమ దేశీయ పౌరులను కిడ్నీప్ చేస్తోందంటూ యుక్రెయిన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. యుక్రెయిన్‌ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని ఆరోపించింది. అంతేకాదు.. తద్వారా వారిని తమ బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఇప్పటికే 4 లక్షల మంది యుక్రెయిన్‌ పౌరులను కిడ్నాప్ చేయగా.. 84వేల మంది పిల్లలే ఉన్నారని యుక్రెయిన్‌ ఆంబుడ్స్‌మన్‌ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. రష్యా మాత్రం యుక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది.

Read Also :  Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..