Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు గంటగంటకు మారిపోతున్నాయి. ఆఫ్ఘన్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అడ్డొచ్చిన వారిని కాల్చిపడేస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితిలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆయా దేశాలు తమ దేశ పౌరులను వెనక్కు పిలిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా

Afghanistan

Updated On : August 14, 2021 / 4:30 PM IST

Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు గంటగంటకు మారిపోతున్నాయి. ఆఫ్ఘన్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు తాలిబన్లు. ఈ తరుణంలోనే అడ్డొచ్చిన వారిని కాల్చిపడేస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితిలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆయా దేశాలు తమ దేశ పౌరులను వెనక్కు పిలిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే భారత్ ప్రత్యేక విమానంలో 50 మంది భారతీయులను తీసుకొచ్చింది. ఇరాక్ అమెరికా కూడా తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అమెరికా 3000 మంది బలగాలను ఆఫ్ఘనిస్తాన్ పంపింది. దేశంలోని నలుమూలల్లో ఉన్న తమ పౌరులను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది. తమ పౌరులకు అపాయం కలగకుండా ఉండెదనుకు బలగాలను ఆఫ్ఘన్ కి పంపినట్లు పెంటగాన్ తెలిపింది.

అయితే, ఎక్కువ కాలంపాటు అక్కడ ఉండేందుకు తమ సైనికులను పంపడం లేదని, ఇది తాత్కాలిక మిషన్ మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. తమ పౌరులకు, ఎంబసీ సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అమెరికా తాలిబాన్లకు విజ్ఞప్తిచేసింది. ఇదే సమయంలో కువైట్‌లోని అమెరికన్ బేస్ వద్ద 3,500 మంది సైనికులను కూడా అమెరికా మోహరించింది. అవసరమైన సమయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి వీరిని నియమించినట్లు తెలుస్తున్నది.

ఇలాఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై చర్చించేందుకు జో బైడెన్.. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికన్లు అక్కడి నుంచి వెంటనే బయలుదేరేందుకు సిద్ధం కావాలని యూఎస్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. కాగా తాలిబన్లు అనేకమంది ఆఫ్ఘన్ అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమ మాట విననివారిని హత్యచేస్తున్నారు టెర్రరిస్టులు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ అట్టుడుకుతోంది.