Guinness World Record : ఇంత సినిమా పిచ్చా?.. ఏడాదిలో 777 సినిమాలు చూసి వరల్డ్ రికార్డు

ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సినిమాలు సంవత్సరం మొత్తం ఓ వ్యక్తి ఇదే పనిలో ఉన్నాడు. ఇదేం సినిమా పిచ్చి.. అనుకుంటున్నారు కదూ.. ఎక్కువ సినిమాలు చూసి వరల్డ్ రికార్డు సాధించాడు.

Guinness World Record : ఇంత సినిమా పిచ్చా?.. ఏడాదిలో 777 సినిమాలు చూసి వరల్డ్ రికార్డు

Guinness World Record

Guinness World Record : US కి చెందిన ఓ వ్యక్తి సంవత్సరంలో 777 సినిమాలు చూసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం దక్కించుకున్నాడు.

Guinness World Record : 160 కి.మీ నిద్రలో నడిచిన బాలుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వింత స్టోరి

అమెరికాకి చెందిన జాక్ స్వోప్ 2022 జూలై నుండి 2023 జూలై మధ్య 777 సినిమాలు చూసి అత్యథిక చిత్రాలను చూసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను నియమాలను అనుసరించాడని నిర్ధారించుకున్నాకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అతని రికార్డ్ ఖరారు చేసింది. 2015 లో ఫ్రాన్స్‌కి చెందిన విన్సెంట్ క్రోన్ 715 సినిమాలు చూసి సాధించిన రికార్డును జాక్ స్వోప్ అధిగమించాడు. 32 సంవత్సరాల జాక్‌కి సినిమాలంటే చాలా ఇష్టమట. ప్రతి సంవత్సరం 100 నుంచి 150 సినిమాలు చూస్తాడట. రికార్డ్ బ్రేక్ చేసే ప్రయత్నంలో జాక్ ‘మిలియన్స్ : రైజ్ ఆఫ్ గ్రూ’ సినిమాతో మొదలుపెట్టి.. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమాతో ముగిస్తూ రకరకాల సినిమాలు చూసాడట.

Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

రికార్డును బద్దలు కొట్టాలంటే అన్ని సినిమాలను పూర్తిగా చూడాలి. అంతే కాదు సినిమా చూసే టైంలో ఏ ఇతర పనులు చేయకూడదు. అంటే సినిమా చూస్తూ ఫోన్ చూసుకోవడం, నిద్రపోవడం వంటివి చేయకూడదు. సినిమా చూస్తూ ఏదైనా తినడం, తాగడం వంటివి కూడా చేయకూడదట. ఈ నిబంధనలను జాక్ పాటించాడా? లేదా? అనేది గిన్నిస్ యాజమాన్యం నిశితంగా పరిశీలించింది. జాక్ రీగల్ సినిమాస్‌లో ఎక్కువ సినిమాలను చూసాడట. అందులో అతను అన్‌లిమిటెడ్ మెంబర్‌షిప్ తీసుకున్నాడట. $22 కే  (18,287.50 ఇండియన్ కరెన్సీలో) చాలా సినిమాలు చూడవచ్చునట. ఓ వైపు జాబ్ చేసుకుంటూనే ఈ రికార్డ్ మీద దృష్టి పెట్టాడు జాక్. వీకెండ్‌లో మార్నింగ్ 6.45 నుంచి మధ్యాహ్నం 2.45 వరకూ పని చేసి ఆ తర్వాత మూడు సినిమాలు చూడటానికి థియేటర్‌కి వెళ్లేవాడట. ఒక్కోసారి మరిన్ని సినిమాలు చూసేవాడట. ఏదైతేనేం మొత్తానికి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు జాక్.