అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేస్తున్న జంతువులు..!!

  • Published By: nagamani ,Published On : November 3, 2020 / 05:04 PM IST
అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేస్తున్న జంతువులు..!!

US Presiden Election Animal Prediction: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ దేశాలన్నీ అమెరికావైపే చూస్తుంటాయి. అధ్యక్ష పదవికి ఎవరు గెలుస్తారు? అనే ఉత్కంఠ ప్రపంచ దేశాలన్నింటికీ ఉంటుంది. ప్రస్తుతం అదే వేడి అమెరికాలో ఉంది. ఈ సారి అధ్యక్ష పీఠాన్ని ఎవరు చేజిక్కించుకుంటారనే దానిపైనే మొత్తం దృష్టి అంతా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు? రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తారా లేక… డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలుస్తారా? అన్నదానిపై అమెరికాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో..ఎవరు అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుంటారో నని ప్రజలు తలలు బద్దలు కొట్టుకుంటుంటే..జంతువులు మాత్రం ఎవరు ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంటారో చెప్పేస్తున్నాయి.



అమెరికా ప్రెసిడెంట్ పీఠం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవటానికి రష్యాలోని… రొయెవ్ రుచే జూలో సరదాగా ఓ అంచనాను జంతువులతో వేయించారు. ఈ అంచనా కార్యక్రమంలో ఖాన్, బుయాన్, బార్టెక్ అనే మూడు జంతువులు పాల్గొన్నాయి. ఈ జంతువులు పుచ్చకాయల ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ ముందే చెబుతున్నాయి. ఈ అంచనా కోసం ఒకే సైజ్, ఒకే కలర్ ఉన్న పుచ్చకాయలపై ట్రంప్, బిడెన్ ముఖాలను చిత్రీకరించారు. అలా 6 పుచ్చకాయలను రెడీ చేశారు.


ముందుగా…బార్టెక్ పులి ఉండే బోనులో ట్రంప్, బిడెన్ బొమ్మల్ని చిత్రీకరించిన 2 పుచ్చకాయలు ఉంచారు. కానీ పులికి మాత్రం ముఖాలు చిత్రీకరించిన వైపు కాకుండా పుచ్చకాయలను మరోవైపు తిప్పి పెట్టారు. వెంటనే బార్టెక్ పులి… బిడెన్ పుచ్చకాయను కదిపి… దొర్లించుకుంటూ తీసుకెళ్లి తినేసింది.


ఆ తర్వాత ఖాన్ అనే వైట్ బెంగాల్ టైగర్‌కి కూడా మరో 2 పుచ్చకాయలు ఇవ్వగా… అది కూడా జో బిడెన్ పుచ్చకాయను తన్నుకుంటూ ఆటాడుకుంది. ఆ తర్వాత పుచ్చకాయ మధ్యలో కన్నం పెట్టి మరీ ఆరగించేసింది.ఇక లాస్ట్ లో బుయాన్ ఎలుగు బంటికి 2 పుచ్చకాయలు ఇవ్వగా..అది కూడా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ నే సెలెక్ట్ చేసుకుంది. ఆ పుచ్చకాయను తినేసింది. కాగా..గతంలో ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇదే బుయాన్… తప్పుగా అంచనా వేసింది. అందువల్ల ఇప్పుడు ఇది కరెక్టుగా అంచనా వేసిందా అనేది పెద్ద డౌటనుమానమే.


ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతారనీ, జో బిడెన్ గెలుస్తారనీ ఈ మూడు జంతువులూ నిర్ణయించేశాయి. కానీ అది ఎంత వరకూ నిజమౌవుతుందో వేచి చూడాలి. అమెరికాలో జరుగుతున్న సర్వేల్లో కూడా జో బిడెన్ గెలుస్తారనే అంచనా వస్తోంది.


జో బిడెన్ గెలుపు సాధిస్తే…అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ నియమితులవుతారు. పైగా బిడెన్…భారత్ పట్ల చాలా పాజిటివ్‌గా ఉన్నారు. అందువల్ల ఇండియన్స్‌లో చాలా మంది బిడెన్ గెలవాలని కోరుకుంటున్నారు. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్లు కూడా బిడెన్ గెలుపునే కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.