Memory : కరోనా మృతుల కోసం..మెసేజ్‌ రాసిన 6 లక్షల తెల్ల జెండాలు..

కరోనా మృతుల కోసం..మెసేజ్‌ రాసిన 6 లక్షల తెల్ల జెండాలు ఏర్పాటు చేశారు. కరోనాతో మృతి చెందిన వారి వారి ఆత్మీయులను గుర్తు చేసుకుంటూ తెల్లజెండాలపై సందేశాలు నేషనల్ హాల్‌ మైదానంలో ఉంచారు

Memory : కరోనా మృతుల కోసం..మెసేజ్‌ రాసిన 6 లక్షల తెల్ల జెండాలు..

White Flags For Covid Victims (1)

Washington DC : కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయి ఎంతోమంది వేదనలో మునిగిపోయారు.కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా..గాయం పెట్టిన కాలమే ఎంతటి బాధనైనా తగ్గిస్తుంది. అలా రోజులు వారాలు నెలలు గడిచేకొద్ది కరోనాతో చనిపోయినవారిని మరచిపోతు వారిని జ్ఞాపకార్థం తెల్లజెండాలపై తమ ఆత్మీయులకు ప్రత్యేక సందేశాల్ని రాసి ఓ చోట ఉంచారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించేందుకు వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ మాల్‌ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఏకంగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ హాల్‌ మైదానంలో కరోనాతో చనిపోయిన తమ ఆత్మీయుల కోసం ప్రత్యేక మెసేజ్‌ రాసి ఉంచిన తెల్ల జెండాలను ప్రదర్శించే వీలుకల్పించారు. అక్టోబర్ 3 వరకు ఇక్కడ తెల్ల జెండాలు ప్రదర్శించటానికి వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేస్తోంది ఈ మైదానం.

ఆ తెల్ల జెండాలపై ప్రత్యేకంగా మెసేజ్‌ రాసి వాటిని ప్రదర్శించుకునేలా ఆర్టిస్ట్ సుజానే బ్రెన్నాన్ ఫిర్‌స్టెన్‌బర్గ్ ఈ ఏర్పాటు చేశారు. సుజానే బ్రెన్నాన్‌ సోషల్ యాక్షన్ ఆర్టిస్ట్…సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. సుజానే బ్రెన్నాన్‌ తన వాలంటీర్ల టీమ్ తో కలిసి ఈ జెండాలను ఏర్పాటు చేయడానికి 2,000 గంటలు కష్టపడ్డారు.అమెరికాలో కొవిడ్‌ మరణాలను లెక్కించడానికి సుజానే బ్రెన్నాన్‌ ప్రతిరోజూ జెండాలను పెంచుతున్నారు. 3.8 మైళ్ల పొడవు ఫుట్‌పాత్ ఉన్న ఈ ఇన్‌స్టాలేషన్ వద్ద ప్రాణాలు కోల్పోయిన తమ ప్రియమైన వారికి నివాళులు అర్పించేలా ఏర్పాట్లు కూడా చేశారు.

స్మారక చిహ్నానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని వారు తమ సంస్మరణలను అధికారిక వెబ్‌సైట్ www.inamericaflags.org ద్వారా కూడా పంపవచ్చునని నిర్వాహకులు తెలిపారు. దీంతో పలువురు ఆ వెబ్ సైట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తమ ఆత్మీయుల పేర్లు వివరాలు తెలుపుతున్నారు. కాగా..1987 తరువాత ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఈ మైదానం అతి పెద్ద స్మారక కేంద్రంగా మారటం గమనించాల్సిన విషయం.అంటే కరోనా అంతమందిని పొట్టన పెట్టుకుందని తెలుస్తోంది.

ప్రపంచంలో COVId-19 ప్రభావిత దేశాలలో అమెరికా ఒకటి. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ప్రకారం, యుఎస్ ఇప్పటి వరకు 4.25 కోట్ల COVID-19 కేసులను నమోదు చేసింది. ఇప్పటివరకు 4.46 లక్షల మందికి పైగా ప్రాణాంతక వ్యాధితో ప్రాణాలు కోల్పోయని తెలిపింది.