మేయర్ అయిన మేక : కుక్కపై 13 ఓట్ల తేడాతో గెలుపు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 07:55 AM IST
మేయర్ అయిన మేక : కుక్కపై 13 ఓట్ల తేడాతో గెలుపు

నగర మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. ఏంటి జోక్ అనుకుంటున్నారా..కాదు అక్షరాల సత్యం. మిచిగన్‌లోని ఒమెనా అనే గ్రామంలో జంతువులకు జరిపిన ఎన్నికల్లో పిల్లి మేయర్‌ అయ్యిందనే వార్త విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ నగరానికి మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. మేయర్ పదవి కోసం ఓ మేక..కుక్కలు, పిల్లులతో పోటీపడింది. ఈ పోటీలో ఎట్టకేలకు మేక 13 ఓట్ల తేడాతో మేయర్ పదవిని దక్కించుకుంది. జంగిల్ బుక్ కథ గుర్తుకొస్తోంది కదూ..కానీ ఇది కథకాదు జరిగిన వాస్తవం..ఇది అమెరికాలోని ఫెయిర్ హెవెన్‌లో జరిగింది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం. 
Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్‌ తరహాలో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్లు

సుమారు 2500 జనాభా కలిగిన ఫెయిర్ హెవెన్‌ నగరానికి  మేయర్ లేరు. దీంతో ఆ టౌన్ బాధ్యతలన్నీ జోసెఫ్ గంటర్ అనే మేనేజరే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ టౌన్ లో ప్లేగ్రౌండ్ కట్టాలని అనుకున్నాడు. దీనికి కావాల్సిన ఫండ్స్ కోసం ఓ ఐడియాను ఆలోచించాడు. మిచిగన్‌లోని ఒమెనా అనే గ్రామంలో జంతువులకు జరిపిన ఎన్నికల్లో పిల్లి మేయర్‌ అయ్యిందనే వార్త చూశాడు. గంటర్ కూడా ఫెయిర్ హెవెన్‌లో కూడా జంతువులకు ఎన్నికలు నిర్వహించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. పోటీలో నిలబడే జంతువుకు సంబంధించిన  యజమాని డబ్బు చెల్లించాలనే షరతు పెట్టాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన  జంతువును నగర మేయర్‌గా నియమిస్తామని ప్రకటించాడు. 
 

ఈ ప్రకటనతో ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కానీ ఫండ్స్ కోసమే ఈ ఎన్నికలని చెప్పడంతో అంతా మంచి ఇంట్రెస్ట్ గా ఫాలో అయిపోయారు.దీంతో పిల్లలంతా తమ పెంపు జంతువులను తీసుకొచ్చి డబ్బులు కట్టి ఎన్నికల్లో పాల్గొన్నారు తమ జంతువులతో. ఈ ఎన్నికల్లో ఓ స్కూల్ టీచర్‌కు చెందిన లింకన్ అనే మేకతోపాటు పలువురికి చెందిన కుక్కలు, పిల్లులు సైతం పోటీకి నిలబడ్డాయి. కానీ లింకన్  అనే మేక సమ్మి అనే కుక్కపై 13 ఓట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మేక (లింకన్) ఆ టౌన్ కు మేయర్  అయిపోయింది.
Read Also : షాపింగ్ మాల్‌లో ప్రపోజ్.. ప్రేమ జంటకు పోలీసుల ట్విస్ట్

ఈ కౌన్సిల్‌లో మరో 15 జంతువులు కూడా సభ్యులుగా ఎన్నికయ్యాయి. మేయర్‌గా ఎన్నికైన లింకన్ ఏడాదిపాటు ఆ పదవిలో ఉంటుంది. దానికి మెమోరియల్ పరేడ్‌తోపాటు ప్రతి ఫ్రైడే ఆపిల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. పోటీ అయితే బాగానే జరిగింది. కానీ, ఆ ఎన్నికల్లో కేవలం 100 డాలర్ల ఫండ్ మాత్రమే వచ్చింది. కానీ ఇంకో మంచి పనికూడా జరిగింది. ఈ ఎన్నికల వల్ల పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని గంటర్ తెలిపారు. భలే బాగుంది కదూ మేక గారి మేయర్ రియల్ స్టోరీ.