18 Pages: నన్నయ్య రాసిన కావ్యంలా 18 పేజెస్ గ్లింప్స్!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్(18 Pages) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.....

18 Pages: నన్నయ్య రాసిన కావ్యంలా 18 పేజెస్ గ్లింప్స్!

18 Pages Glimpse Video Impressive

18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్(18 Pages) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, ఈ చిత్రంపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

18 Pages : టైప్ చేసే అక్ష‌రాల‌కి ఎమోష‌న్స్ ఉండ‌వంటున్న నందిని..

ఈ గ్లింప్స్ వీడియో ఆద్యంతం చాలా కలర్‌ఫుల్‌గా ఉండటం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక వీడియో స్టార్టింగ్‌లో నిఖిల్ చెప్పే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ‘‘నాకు తెలియని ఒక అమ్మాయి ఒక విషయం ఎప్పుడూ చెబుతూ ఉండేది… ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే యాన్సర్ ఉండకూదు…’’ అని నిఖిల్ చెప్పిన డైలాగ్ సూపర్బ్‌గా ఉండటంతో ఇది యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ గ్లింప్స్ వీడియోకు ఓ క్లాసికల్ మెలోడీ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ అత్యద్భుతంగా కంపోజ్ చేశాడు.

18 Pages : ఎన‌ర్జిటిక్‌ హీరో నిఖిల్ – బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌‌ కాంబినేష‌న్‌లో ‘18 పేజీస్’..

మొత్తానికి 18 పేజెస్ అనే చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మనముందుకు రాబోతున్నట్లు ఈ చిన్న గ్లింప్స్ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించడం మరో హైలైట్ అని చెప్పాలి. దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, సుకుమార్ కథను అందించాడు. ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి 18 పేజెస్ చిత్రం ఎలాంటి కథను పట్టుకొస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఈ గ్లింప్స్ వీడియోను చూసినవారు.