Rohit Sharma: డ‌బ్ల్యూటీసీ పాయె.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌పై రోహిత్ సేన దృష్టి.. ఈ సారి అలా ఆడ‌తార‌ట‌

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ ఫైన‌ల్‌(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వ‌రుస‌గా రెండో సారి భార‌త జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గానే నిలిచింది.

Rohit Sharma: డ‌బ్ల్యూటీసీ పాయె.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌పై రోహిత్ సేన దృష్టి.. ఈ సారి అలా ఆడ‌తార‌ట‌

Rohit Sharma

Rohit: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ ఫైన‌ల్‌(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వ‌రుస‌గా రెండో సారి భార‌త జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గానే నిలిచింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి అక్టోబ‌ర్‌లో స్వ‌దేశంలో జ‌రుగ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్(ODI World cup) పై ప‌డింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదిక‌లు, మ్యాచ్‌ల వివ‌రాల‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) కి పంపింది. ఐసీసీ ఆమోదం అనంత‌రం షెడ్యూల్ విడుద‌ల కానుంది.

అప్పుడెప్పుడో 2013లో ధోని కెప్టెన్సీలో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది భారత్‌. ఆ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సారి కూడా మ‌రో ఐసీసీ టోఫ్రీని టీమ్ఇండియా సొంతం చేసుకోలేక‌పోయింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విరాట్ కోహ్లి సార‌థ్యంలో 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2021 టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో పాటు 2021లో జ‌రిగిన మొద‌టి డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ టీమ్ఇండియా ఆడింది. ఆయా టైటిళ్ల‌ను సాధించ‌డంలో భార‌త్ విఫ‌లమైంది.

Womens Asia Cup 2023 : విజృంభించిన శ్రేయాంక పాటిల్.. 34 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ప్ర‌త్య‌ర్థి .. భార‌త్‌ ఘ‌న విజ‌యం

ఆ త‌రువాత రోహిత్ కెప్టెన్సీలో అయినా క‌ల నెర‌వేరుతుంద‌ని బావించినా అది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. రోహిత్ నాయ‌క‌త్వంలో భార‌త్ 2022 టి20 ప్ర‌పంచ‌క‌ప్‌, ఆసియా క‌ప్ 2022, తాజాగా డబ్ల్యూటీసీ 2023లోనూ ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో రోహిత్‌ను సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌నే డిమాండ్లు మొద‌లు అయ్యాయి. అయితే.. వీటిని ఏ మాత్రం ప‌ట్టించుకోని హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ స్వదేశంలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పై దృష్టి సారించిన‌ట్లు వెల్ల‌డించాడు.

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. విభిన్న‌మైన ఆట‌తీరుతో మెగా టోర్నీలో రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నాడు. అభిమానుల‌ను అల‌రించేందుకు తాము శాయ శ‌క్తుల కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ఫ‌లానా మ్యాచ్ గెల‌వాల‌ని అని చూడ‌కుండా ప్ర‌తి మ్యాచ్‌లో కూడా గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తాం. ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డంపైనే ప్ర‌స్తుతం దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు రోహిత్ అన్నాడు.

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ కంటే ముందు టీమిండియా ఏయే టోర్నీల్లో పాల్గొంటుందో తెలుసా?

కాగా.. జ‌ట్టులోని రోహిత్‌, కోహ్లి వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఇదే ప్ర‌పంచ క‌ప్ అయ్యే అవ‌కాశం ఉంది. వారి వ‌య‌సును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ నాటికి వారు ఫిట్ గా ఉంటారా అన్నది చెప్ప‌లేం. అయితే.. స్వ‌దేశంలో ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌నుండ‌డంతో గెలిచి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌ని కొంద‌రు అభిమానులు కోరుకుంటున్నారు.