Siddipet : ఎయిర్ గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు.

Siddipet
Siddipet : సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని ముద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి ఎనిమిది మంది వచ్చారు. వారంతా రాత్రి షికారుకు వెళ్ళారు.
చదవండి : Widow killed in Guntakal : గుత్తిలో దారుణం : వితంతు కోడలిని హత్య చేసిన మామ
ఈ సమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో అతడిని స్నేహితులు సిద్ధిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి : Gun Fire: మూత్రం పోస్తుండగా ప్యాంటు జేబులో పేలిన గన్..పరిస్థితి ఎలా ఉందంటే..