Alia Bhatt: ఎన్టీఆర్ సినిమా నుండి అమ్మడు ఔట్..?

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తాజాగా హీరో రణ్‌బీర్ కపూర్‌ని వివాహం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిపీటలెక్కి.....

Alia Bhatt: ఎన్టీఆర్ సినిమా నుండి అమ్మడు ఔట్..?

Alia Bhatt To Quit Ntr30

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తాజాగా హీరో రణ్‌బీర్ కపూర్‌ని వివాహం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిపీటలెక్కి ఒక్కటయ్యారు. కాగా ఈ బ్యూటీ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో సీత పాత్రలో ఆలియా పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఆలియా పర్ఫార్మెన్స్‌కు ఇంప్రెస్ అయ్యి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే నెక్ట్స్ మూవీలో కూడా ఆమెను హీరోయిన్‌గా ఓకే చేశారట చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఆలియా పెళ్లి జరగడంతో, ఆమె తన నెక్ట్స్ సినిమా నుండి వెళ్లిపోతుందనే వార్త టాలీవుడ్ వర్గాలను కలవరపెడుతోంది.

Alia-Ranbir: పెళ్లిపీటలెక్కిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా-రణ్‌బీర్

తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. పూర్తి రివెంజ్ డ్రామాగా కొరటాల తనదైన మార్క్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ సినిమాలోని క్యాస్టింగ్‌ను ఎంపిక చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఎన్టీఆర్ సరసన ఆలియా భట్‌ను చిత్ర యూనిట్ హీరోయిన్‌గా ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమాను వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులను ఓకే చేసిన ఆలియా, వాటి డేట్స్ కారణంగా.. అటు కొత్తగా పెళ్లి కావడంతో తన పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించాలనే కారణంగా.. ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30వ సినిమాను వదులుకోబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వారు ఈ సినిమాలో ఆలియాను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు కూడా అనౌన్స్ చేయకపోవడంతో, ఇప్పుడు ఆమె ఈ సినిమాను వదులుకున్నా కూడా వారు స్పందించకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, తారక్ సరసన మరో పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ కావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో తారక్ సరసన ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.