TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి

హైదరాబాద్‌లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఉదయం 11.30 గంటలకు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి

Trs

arrangements for the TRS Plenary : హైదరాబాద్‌లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. హైటెక్స్‌కు వెళ్లే దారులన్నీ పార్టీ నేతల కటౌట్లతో స్వాగతం పలుకుతున్నాయి.

మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండగ కోసం ధూంధాంగా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి ఆరున్నర వేల మందికి పైగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ముందుగా సీఎం కేసీఆర్‌ TRS ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ప్లీనరీ సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు. ప్లీనరీ కోసం ప్రత్యేకంగా సాంగ్‌ను కూడా రూపొందించారు. వేలాది ఫొటోలతో సీఎం కేసీఆర్‌ లైఫ్‌ హిస్టరీని ప్రదర్శిస్తారు.

Harish Rao : ధరలు పెంచి సామాన్యులను పీడిస్తోన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి : మంత్రి హరీశ్‌ రావు

ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలకు ఒకచోట, కార్యకర్తల వాహనాలకు మరోచోట పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే హైటెక్స్‌ పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.