Suryapet District : మానవత్వం అంటే ఇది.. పిల్లి ప్రాణాలు కాపాడటానికి 188 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన జంతు సంరక్షణ సంస్థ
ఓ పిల్లి బావిలో పడిపోయింది. 48 గంటలు దాటిపోయింది. దానిని కాపాడటానికి స్ధానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాని ప్రాణాలు కాపాడారా? అది బయటకు రాగలిగిందా?

Suryapet District
Suryapet District : ఓ పిల్లి ఎలా పడిందో బావిలో పడిపోయింది. బయటకు రాలేక ఇరుక్కుపోయింది. దానిని కాపాడాలని స్ధానికులంతా విశ్వ ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సంస్థలను ఆశ్రయించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ మూగజీవిని కాపాడటానికి ఓ జంతు సంరక్షణ సంస్థ ముందుకొచ్చింది. మానవత్వం చాటుకుని ఆ పిల్లి ప్రాణాలు కాపాడింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ బావిలో పిల్లి పడిపోయింది. పిల్లే కదా.. అని స్ధానికులు పట్టించుకోకుండా ఉండలేకపోయారు. దాని ప్రాణాలు కాపాడమని ప్రభుత్వ రెస్క్యూ టీంని సాయం కోరారు. వారు అస్సలు పట్టించుకోలేదు. తాము కాపాడదామంటే పిల్లి దాడి చేస్తుందేమో అని భయపడ్డారు. ఎలాగైనా దానిని కాపాడాలని ఓ యువకుడు హైదరాబాద్‌లోని యానిమల్ వారియర్స్ టీంకి ఫోన్ చేసాడు. ఇక వారు ఆఘమేఘాలపై పిల్లిని కాపాడేందుకు 188 కిలోమీటర్లు ప్రయాణం చేసి సూర్యాపేటకు వచ్చారు. 40 అడుగుల లోతున్న బావిలోకి దిగి ఓ కేజ్ ద్వారా దానిని బయటకు తీశారు. 48 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పిల్లి బయటకు రాగానే సంతోషంగా పరుగులు పెట్టింది.
Shah Rukh Khan : షారూఖ్ పాటను చూస్తూ ఎంజాయ్ చేసిన పిల్లి.. రెస్పాండ్ అయిన షారూఖ్ ఖాన్
ఓ పిల్లి ప్రాణం కాపాడటానికి అంత దూరం నుంచి ఎంతో శ్రమించి వచ్చిన యానిమల్ వారియర్స్ టీంకి అక్కడి ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ప్రదీప్ ఆ మూగజీవిని కాపాడటం ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. జంతువుల ప్రాణాలు కాపాడటానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.