Balakrishna : బాలకృష్ణకి గాయం.. అయినా ఆపకుండా షూటింగ్..

ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్స్ అంతా ఏదో ఒక విధంగా గాయాలపాలవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్.. అది మరవక ముందే హీరో రామ్ మెడకి ఇంజ్యుర్ అవ్వడం జరిగాయి. తాజాగా

Balakrishna : బాలకృష్ణకి గాయం.. అయినా ఆపకుండా షూటింగ్..

Balayya

Balakrishna :  ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్స్ అంతా ఏదో ఒక విధంగా గాయాలపాలవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్.. అది మరవక ముందే హీరో రామ్ మెడకి ఇంజ్యుర్ అవ్వడం జరిగాయి. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణకి షూటింగ్ లో గాయం అయింది.

ఇటీవలే ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు బాల‌య్య‌ బాబు. ప్రస్తుతం ఆహా ఓటిటిలో ఒక టాక్ షో కి హోస్ట్ గా చేస్తున్నట్టు సమాచారం. ఆహాలో ప్ర‌సారం కానున్న ఈ టాక్ షో కోసం నిన్న‌ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ షూట్‌ జరుగుతున్న స‌మ‌యంలో బాల‌య్య కాలుకి గాయం అయింది. అయినా గాయాన్నిలెక్క చేయ‌కుండా బాల‌కృష్ణ షూటింగ్‌లో పాల్గొన్నాడ‌ని సమాచారం.

MAA Elections : ‘మా’ ఎలక్షన్స్ రేపే.. గెలుపెవరిది??

షూట్ పూర్త‌య్యాక హాస్పిటల్ కి వెళ్లి కాలికి చికిత్స చేయించుకున్నారు బాలకృష్ణ. బాలయ్య బాబుకి గాయం అయిందని తెలియడంతో అభిమానులు ఆందోళనకి గురయ్యారు. ప్రస్తుతం ఎవరూ కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని బాలకృష్ణ చికిత్స చేయించుకున్నారని, ఆయన ఆరోగ్యం బాగుందని సన్నిహిత వర్గాలు అభిమానులకి తెలిపారు. ఇక ఆహాలో రాబోయే బాల‌య్య టాక్ షోకి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న త్వరలో రానుంది. ఇన్నాళ్లు సినిమాల్లో మాస్ హీరోగా అదరగొట్టిన బాలయ్య ఇప్పుడు షోలో హోస్ట్ గా ఎలా చేస్తారో అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.