Agnipath: ‘అగ్నిపథ్’ నిరసనలపై బండి సంజయ్ ఎమన్నారంటే..

ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ్ ఆందోళన కారులకు, యువతకు విజ్ఞప్తి చేశారు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Agnipath: ‘అగ్నిపథ్’ నిరసనలపై బండి సంజయ్ ఎమన్నారంటే..

Agnipath

Agnipath: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైళ్లకు నిప్పుపెట్టారు. మొదటి మూడు ఫ్లాంట్ ఫాంలలో పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జి చేశారు. అయిన పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరపడంతో వరంగల్ కు చెందిన ఓ యువకుడు మృతిచెందగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ తో సహా పలు రైల్వే స్టేషన్లు మూసివేశారు. మెట్రో సేవలను నిలిపివేశారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్

ఇదిలాఉంటే ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ్ ఆందోళన కారులకు, యువతకు విజ్ఞప్తి చేశారు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Agnipath: హైద‌రాబాద్ మెట్రో రైళ్ళు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

ఇంత మంది ఆందోళనకారులు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందంటూ సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి ఇదని, ముసుగులు వేసుకొని వచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థులు, యువత గొప్ప వ్యక్తులు, వాళ్లు ఇలా చేస్తారని నేను అనుకోను అంటూ సంజయ్ అన్నారు.