Five State Elections: రిసార్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, హోటల్ లో బీజేపీ మీటింగ్: అభ్యర్థులను కాపాడుకుంటున్న పార్టీలు

ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి.

Five State Elections: రిసార్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, హోటల్ లో బీజేపీ మీటింగ్: అభ్యర్థులను కాపాడుకుంటున్న పార్టీలు

Elections

Five State Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఫలితాలపై సొంత రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా గెలుపోటములపై ఒక అంచనాకు వచ్చిన పార్టీలు..తమ అభ్యర్థులను కాచుకుకూర్చున్నాయి. ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి. పార్టీల ఇంచార్జిలను, సీనియర్ నేతలను రంగంలోకి దింపిన ఆయా పార్టీల అధిష్టానాలు.. కౌంటింగ్ పై స్పష్టత వచ్చే వరకు అభ్యర్థులను ఓ కంట కనిపెట్టి ఉంచాలని సూచనలు జారీ చేశాయి.

Also read: UP : స్ట్రాంగ్ రూం వద్ద బైనాక్యులర్‌‌తో ఎస్పీ అభ్యర్థి నిఘా.. 24 గంటల పాటు భద్రత

ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ మరియు మణిపూర్ ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నాయకులను నియమించింది. ముందుగా గోవా విషయానికొస్తే.. బీజేపీ.. తమ అభ్యర్ధులందరిని ఒక హోటల్ లో సమావేశ పరిచింది. రాష్ట్ర ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం ప్రమోద్ సావంత్, సీటీ రవి, గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తనవాడే.. ఈ సమావేశంలో పాల్గొని అభ్యర్థులకు సూచనలు చేసారు. ఇక కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇక్కడి ఒక రిసార్ట్ లో సమావేశ పరిచింది. గోవాలో ఇంచుమించుగా కాంగ్రెస్ – బీజేపీలకు చెరిసగం సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో ఇక్కడి గెలుపు పై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ.. అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Also read: TS CM KCR : ఏపీలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..ఏపీలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జగన్ గారూ అంటూ ప్రశ్న

ఉత్తరాఖండ్ లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతో.. కాంగ్రెస్ పార్టీ పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా.. డెహ్రాడూన్ చేరుకుని.. తమ అభ్యర్థులను రహస్య ప్రాంతంలో సమావేశ పరిచినట్లు తెలుస్తుంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే విజేతలను రాజస్థాన్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పంజాబ్‌లో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఛత్తీస్‌గఢ్ సీనియర్ నాయకుడు టిఎస్ సింగ్ దేవ్ మరియు విన్సెంట్ పాలా ఇప్పటికే మణిపూర్‌ చేరుకున్నారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులతో ఒక్కొక్కరిగా చర్చలు జరుపుతున్నారు.

Also read: UP Election 2022 : ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఖండించిన సీఈసీ

ఈ రెండు ప్రధాన పార్టీలే కాక.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం తమ అభ్యర్థులపై నిఘా ఉంచాయి. ఫలితాలు తేలే వరకు అభ్యర్థులను కాపాడుకుంటే విజయానికి అడుగు దూరంలో ఉన్నా..అందుకోవచ్చని పార్టీ అధిష్టానాలు తాపత్రయ పడుతున్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఎవరు విజయ శంఖారావాన్ని పూరిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also read: Telangana Assembly : ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది..గ్రామీణాభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?