OTT Release: థియేటర్లకు ధీటుగా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

ఈ వారం చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు.. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు వరసపెట్టి నువ్వా నేనా అన్నట్టు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి పోటీ పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు..

OTT Release: థియేటర్లకు ధీటుగా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

OTT Release: ఈ వారం చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు.. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు వరసపెట్టి నువ్వా నేనా అన్నట్టు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి పోటీ పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ధియేటర్లో రిలీజ్ అవుతుంటే.. మోస్ట్ ఎంటర్ టైనింగ్ అండ్ ఎంగేజింగ్ సిరీస్ లతో ఓటీటీలు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం ఏ సినిమాలు ఓటీటీలో ఆడియన్స్ కోసం రిలీజ్ అవుతున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం.

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో ఈ వారం సినిమాలివే!

ధియేటర్లలోనే ఈ రేంజ్ భారీ సినిమాలతో ఆడియన్స్ కి ఇంట్రస్టింగ్ కంటెంట్ రెడీ గా ఉంటే ఓటీటీలు కూడా అంతకుమించిన కంటెంట్ తో ధియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. సౌత్ దగ్గరనుంచి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో ఈ వీక్ మొత్తం ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. ధియేటర్లో గురువారం, శుక్రవారం బిగ్గెస్ట్ మూవీస్ రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలు కూడా తగ్గేదే లే అంటున్నాయి.

2021 Hindi OTT Releases: బాలీవుడ్‌‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!

ఏప్రిల్ 14న శర్వానంద్ ఆడవాళ్లూ మీకు జోహార్లతో వ్యూయర్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది సోనీలివ్. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో పెళ్లి కాన్సెప్ట్ ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఆడవాళ్లూ మీకు జహార్లు మూవీ సోనీలివ్ లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

అచ్చతెలుగు ఓటీటీ యాప్ గా ప్రతి శుక్రవారం కొత్త మూవీని తన ఆడియన్స్ కి అందిస్తున్న ఆహా ఓటీటీ ఈవారం కూడా ఇంట్రస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో నివేతా పేతురాజ్ లీడ్ రోల్ లో తెరెకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటి వరకూ క్యూట్ క్యారెక్టర్లు చేసిన నివేతాపేతురాజ్.. నెవర్ బిఫోర్ రోల్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యబోతోంది.

Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రామ్ గోపాల్ వర్మ దహనం ఓటీటీ సిరీస్ కూడా ఈ వారం ఆడియన్స్ ముందుకొస్తోంది. నైనా గంగూలీ, అభిషేక్, అభిలాష్ లీడ్ రోల్స్ లో అగస్త్య మంజుల డైరెక్షన్లో తెరకెక్కించిన దహనం సిరీస్ రామ్ గోపాల్ వర్మ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో ఏప్రిల్ 14నుంచి తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతోంది. అయితే అదేరోజు జీ5లో రిలీజ్ అవుతోంది గాలివాన షో. రాధిక శరత్ కుమార్, సాయికుమార్ లాంటి సీనియర్లు లీడ్ రోల్స్ లో చాందిని, చైతన్య, నందినీ నటించిన మర్డర్ ధ్రిల్లర్ గాలివాన.. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్లో ఈ గురువారం నుంచి స్ట్రీమ్ అవ్వబోతోంది.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాగా రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసిన మూవీ జేమ్స్. కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీని ధియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ చేసి పునీత్ కి నివాళిగా ఇచ్చారు ఫాన్స్. ఇప్పుడు ఇదే మూవీ సోనీ లివ్ లో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఏప్రిల్ 15 నుంచి కన్నడ లో ఈసినిమా అవైలబుల్ గా ఉంటోంది.

OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

బాలీవుడ్ లో ఫుల్ గా సేల్ అవుతున్న మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన మరో మూవీ మాయ్. సాక్షి తన్వర్, రైమా సేన్, వామికా లీడ్ రోల్ లో నటించిన మాయ్ మూవీ ఏప్రిల్ 15 న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. తన కూతుర్ని చంపిన వాళ్లని వెతికి మరీ చంపే క్యారెక్లర్లో సాక్షి తన్వర్ కి ఇప్పటికే మంచి అప్లాజ్ సంపాదించుకుంది.

Senior Heroins: ఏజ్ నాట్ ఇంపార్టెంట్.. కుర్రహీరోలతో సీనియర్ భామల రొమాన్స్!

హాలీవుడ్ కి సంబంధించి ద మోస్ట్ ఇంట్రస్టింగ్ సిరీస్ లు ఈ వారం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ కొరియన్ డ్రామా మిస్టరీ సైంటఫిక్ డ్రామా హ్యాపీనెస్ సిరీస్.. నెట్ ప్లిక్స్ లో ఈ వారం స్ట్రీమ్ అవుతోంది. దీనితో పాటు ఇంగ్లిష్ కామెడీ సిరీస్ హార్డ్ సెల్ కూడా స్టీమ్ అవ్వబోతోంది. దమోస్ట్ ఎంటర్ టైనింగ్ అండ్ పాపులర్డ్ టీవీ షో ద కర్దాషియన్స్ డస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వారం ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.