Prophet Row: బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ

బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు.

Prophet Row: బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ

Prophet Row: బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు. మొహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసిన నుపుర్ శర్మకు మద్దతివ్వడంతో కన్హయ్య లాల్ హత్యకు గురయ్యాడని వార్తలు వచ్చాయి.

ఆ బెదిరింపు లేఖలను సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర హోం వ్యవహరాల శాఖ నిత్యానంద్ రాయ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు పంపామని మీనా అన్నారు. దీనిపై విచారణ జరపాలని గతంలో ఎప్పుడూ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు.

“ఢిల్లీలోని నా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ఉదయ్‌పూర్ ఘటన తర్వాత కన్హయ్యలాల్ కుటుంబాన్ని కలిశా. సంతాపాన్ని తెలియజేస్తూ నెల జీతం ఆర్థిక సాయం అందజేస్తానని చెప్పా. మీడియాలో కూడా ఆ విషయం వచ్చింది. ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తో పాటు బెదిరింపు లేఖ పంపించారు” అని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

Read Also: అరెస్టుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

జులై 9న పంపిన ఆ లేఖ కింద రాజస్థాన్ కు చెందిన ఖదీర్ అలీ సంతకం ఉంది.

“మా ప్రవక్తను అవమానించిన వాళ్లను కన్హయ్యలాల్ మాదిరిగా ముగించేస్తాం. అలా చేస్తే పెద్ద నాయకుడైనా పాఠం చెప్తాం. ఇప్పుడు మీనా వంతొచ్చింది. ముస్లింలపై విషం కక్కుతూ తనకు తాను హిందూత్వవాది లీడర్ గా ఫీల్ అవుతున్నాడు” అని లెటర్ లో రాసి ఉంది.