Wedding Photoshoot : వరుడిని కొలనులో తోసేసిన వధువు

ఫోటోషూట్ లో కాబోయే భర్తను కొలనులోకి తోసింది యువతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ ఫోటోషూట్ కి వెళ్లిన జంట కొలను మధ్యలోని ఓ చెక్క బల్లపై నిలబడ్డారు. ఈ సమయంలోనే ఫోటో గ్రాఫర్ వచ్చి స్టిల్స్ ఎలా ఇవ్వాలో చూపించే ప్రయత్నం చేశాడు. ఫోటోగ్రాఫర్ చూపించిన స్టిల్ చూసి సిగ్గుపడిన వధువు, కాబోయే భర్తని.. ఫోటోగ్రాఫర్ ని కొలనులోకి తోసేసింది.

Wedding Photoshoot : వరుడిని కొలనులో తోసేసిన వధువు

Photoshoot

Wedding Photoshoot : పెళ్లంటే జీవితంలో ఓ మధుర జ్ఞాపకం.. ఇది చిరకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు వీడియోలు తీస్తుంటారు. అయితే ఈ మధ్య వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమకు దగ్గర్లోని ప్రాంతాల్లో అందమైన ప్రాంతాలకు ఫోటోషూట్ కు వెళ్తున్నారు. కొంచం ఆర్ధికంగా ఉన్నవారు విదేశాలకు వెళ్లి మరి ఫోటోషూట్ లో పాల్గొంటున్నారు. ఫోటోషూట్ లో అత్యుత్సాహాన్ని పోయి ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. ప్రమాదాల బారినపడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుక్కునవారు కూడా ఉన్నారు.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటోషూట్ కి సంబందించిన కొన్ని ఫన్నీ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఇప్పుడు మనం చూస్తుందని కూడా ఒకటి.. ఇందులో ఓ కొల‌ను మ‌ధ్య‌లో ఉన్న‌ వేదిక‌పై వెడ్డింగ్ ఫొటోషూట్ జ‌రుగుతోంది. ఆ ఫొటోగ్రాఫ‌ర్ వ‌ధూవ‌రుల‌ను రకరకాల ఫోజుల‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఫోటోగ్రాఫర్‌కి ఓ ఫోజు గుర్తొచ్చింది.

అది వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక‌రినొక‌రు అల్లుకుని నిల‌బ‌డాల్సిన రొమాంటిక్ ఫోజు. అది వారికి చెప్పేందుకు ఫోటో గ్రాఫర్ వరుడి దగ్గరగా వెళ్లి చేసి చూపిస్తున్నాడు. అది చూసిన వ‌ధువు సిగ్గు ఆపుకోలేక‌పోయింది. ఫొటోగ్రాఫ‌ర్‌ను, వ‌రుడిని ఇద్ద‌రినీ క‌లిపి కొల‌ను నీళ్ల‌లోకి తోసేసింది. వాళ్లిద్ద‌రూ నీళ్ల‌లోప‌డిపోగానే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)