Cancer drug trial: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. వైద్య చరిత్రలో తొలిసారి..

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో అనేక మంది బాధపడుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి సరియైన చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారు. తొలిదశలో ఈ వ్యాధిని గుర్తించిన కొద్దిమంది మాత్రమే కోలుకుంటున్నారు. అయితే క్యాన్సర్‌ను నయంచేసే మందును కనుగొనేందుకు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు..

Cancer drug trial: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. వైద్య చరిత్రలో తొలిసారి..

Cancar

Cancer drug trial: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో అనేక మంది బాధపడుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి సరియైన చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారు. తొలిదశలో ఈ వ్యాధిని గుర్తించిన కొద్దిమంది మాత్రమే కోలుకుంటున్నారు. అయితే క్యాన్సర్‌ను నయంచేసే మందును కనుగొనేందుకు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా న్యూయార్క్‌లోని స్లోవర్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పరిశోధకులు తాజాగా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి.

Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు

కియోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో నయంకాని క్యాన్సర్ మహమ్మారిని డెస్టర్‌లిమాబ్ అనే ఔషధం పూర్తిగా నయం చేస్తుందని పరిశోధనలకు తెలిపారు. మలాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మంది రోగులకు వైద్యులు డోస్టర్‌లిమాబ్ అనే మందును ఇచ్చారు. కోర్సు పూర్తయిన తరువాత రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌ను తీయించారు. పురీషనాళంలో ఉన్న క్యాన్సర్ గడ్డ తగ్గిపోవటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే పెద్ద మొత్తంలో ట్రయల్స్ నిర్వహణకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.

Bone Cancer : ఎముకల్లో ట్యూమర్లు క్యాన్సర్ కావొచ్చేమో జాగ్రత్త!

ఈ విషయంపై పెద్దప్రేగు క్యాన్సర్ నిపుణులు డాక్టర్ ఆలన్పీ వెనూక్ మాట్లాడుతూ.. ట్రయల్స్‌లో పాల్గొన్న ప్రతీ రోగికీ క్యాన్సర్ నయమవ్వడం ఇప్పటి వరకూ వినలేదు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి అని, ట్రయల్స్‌లో పాల్గొన్న ఏ ఒక్కరిపై దుష్ర్పభావాలు కనిపించక పోవటం గొప్ప విషయం అన్నారు. ట్రయల్స్ సహ అధ్యయనకారిణి డాక్టర్ ఆండ్రియా సెర్కెక్ మాట్లాడుతూ.. వైద్యశాస్త్రంలో ఇదో మహాద్భుతం అని అన్నారు.