Cashews : గుండె ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు!

ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్‌ ఉంటుంది. ఇందులోని కాపర్‌ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, మాంగనీస్‌ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Cashews : గుండె ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు!

Heart Health (1)

Cashews : జీడిపప్పు అనగానే కొవ్వులు అధికంగా శరీరంలో చేరిపోతాయని చాలా మంది భయపడిపోతుంటారు. వాటిని తినేందుకే వెనాముందు ఆలోచిస్తుంటారు. అయితే జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పులో లభించే పీచు ప్రొటీన్లు, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

జీడిపప్పులో లభించే మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయయి. వీటిని తరచు తీసుకోవటం వల్ల ఊబకాయం సమస్య కొంతవరకు తగ్గటమే కాక చర్మం అదంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజు వారిగా తీసుకునే నట్స్ లో కొద్ది పాటి జీడిపప్పు చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పులో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ లాంటివి మనిషి జీవితకాలాన్ని పెంచుతాయి.

ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్‌ ఉంటుంది. ఇందులోని కాపర్‌ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, మాంగనీస్‌ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేయించుకుని లేదంటే, గ్రైండ్‌ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది. మధుమేహ రోగులు, టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీడిపప్పులో సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. దీనిలోని రాగి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల, దంతాల దృఢత్వాన్నివీటిలో ఉండే కాల్షియం తోడ్పడుతుంది.

గమనిక ; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటం జరిగింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జీడిపప్పు తీసుకునే విషయంలో వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.