PM Modi’s message: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క సూచ‌న‌లు!

సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 92.71% ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 10వ తరగతిలో 94.40% మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. శుక్ర‌వారం ఫ‌లితాలు విడుద‌లైన‌ సంద‌ర్భంగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విద్యార్థులకు కీల‌క సూచ‌న‌లు చేశారు.

PM Modi’s message: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క సూచ‌న‌లు!

Pm Modi

PM Modi’s message: సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 12వ తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 92.71% ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 10వ తరగతిలో 94.40% మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. శుక్ర‌వారం ఫ‌లితాలు విడుద‌ల సంద‌ర్భంగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క సూచ‌న‌లు చేశారు. కొంతమంది విద్యార్థులు తమ ఫలితాలతో సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ ఒక్క ప‌రీక్షతో వారి సామ‌ర్థ్యాల‌ను అంచ‌నా వేయ‌లేమ‌ని తెలుసుకోవాలి. ప్ర‌స్తుత ఫ‌లితాల్లో వెనుక‌బ‌డిన‌వారు రాబోయే కాలంలో మరిన్ని విజయాల‌ను సాధిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ మోదీ పేర్కొన్నారు.

CBSE 10th Result 2022 : CBSE టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.. ఏయే వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ సంవత్సరం ‘పరీక్ష పే చర్చా’ వీడియోను పంచుకున్నారు. ఐదవ పరీక్షా పే చర్చలో మోదీ పాఠశాల విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టారు. వారిని ఇక్కడికి నడిపించిన గత పరీక్ష విజయాలను వారికి గుర్తు చేశారు. మీరు ముందు మీ బ‌లాల‌పై దృష్టి సారించండి.

ఇతరులను అనుకరించేలా ఏదైనా ప్రయత్నించి చివరి నిమిషంలో మీ దినచర్యను మార్చుకోకండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పండుగ మూడ్‌తో మీ పరీక్షల్లో కనిపించండి అని పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, ఆందోళనలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మోదీ ఆ వీడియోలో చెప్పారు.