CM KCR : దేశంలో మార్పు అవసరం.. కొత్త జాతీయ పార్టీ రావొచ్చు – సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు...

CM KCR : దేశంలో మార్పు అవసరం.. కొత్త జాతీయ పార్టీ రావొచ్చు – సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Kcr Latest News

KCR National Party : భారతదేశంలో త్వరలో రాజకీయ మార్పు వస్తుందా ? కొత్త జాతీయ పార్టీ పుట్టుకొస్తుందా ? అనే చర్చ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశంలో మార్పు అవసరం.. .కొత్త జాతీయ పార్టీ రావొచ్చు.. తమది బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు..భారత ప్రజల మేలుకోరే రాజకీయ ఫ్రంట్.. అద్భుతమైన పద్ధతిలో కొత్త రాజకీయ పార్టీ రావొచ్చని సంచలన ప్రకటన చేశారు. దీనికి మీరు ఏ పేరు పెట్టుకున్నా ఫర్వాలేదన్నారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) సమావేశం జరిగింది. వరి ధాన్యం కొనుగోలుతో పాటు.. ఇతర రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Read More : CM KCR : ధాన్యం కొనుగోలు సేకరణ.. తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం – కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని గతంలో చెప్పడం జరిగిందని.. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కంటే దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని వెల్లడించారు. దేశంలో బీజేపీ పరిస్థితి దిగజారిపోతోందని, ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందని పేర్కొన్న ఆయన.. ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి మేం ప్రయత్నిస్తున్నామన్నారు. 75 సంవత్సరకాలంలో చాలా సమస్యలున్నాయని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసుగు చెందితే.. బీజేపీకి పట్టం కట్టారన్నారు. 8 బడ్జెట్ లను ప్రవేశపెట్టినా దేశంలో ఏమి జరగలేదన్నారు. కరెంటు, నీటిపారుదల, ఆర్థిక అభివృద్ధి.. ఏరంగం అభివృద్ధి చెందిందా ? అని ప్రశ్నించారు.

Read More : Telangana Paddy : వన్ నేషన్..వన్ ప్రొక్యూర్‌‌మెంట్ ఉండాలి..అన్నీ రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలి – సీఎం కేసీఆర్ డిమాండ్

15 లక్షల ఖాళీలను ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ఎన్నికలు వస్తే.. విధ్వేషం రెచ్చగొట్టడం వారికి అలవాటైందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఉపన్యాసాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందేనని, యూపీలో ఎలాంటి ప్రచారం జరిగింది ? ఇలా ఎక్కడైనా ఉంటుందా అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దుర్మార్గైమన ప్రచారాలు జరుగుతున్నాయని వెల్లడించని సీఎం కేసీఆర్.. హైదరాబాద్ లో ప్రశాంతమైన వాతావరణం ఉండదా అని నిలదీశారు. యువతకు ఉద్యోగాలు రావొద్దా ? పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావొద్దా ? దేశానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా అని సూటిగా ప్రశ్నించారు సీఎం కేసీఆర్.