Karnataka Polls: పోలింగ్ మధ్యలో పొట్లాట.. మంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్‭లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కారును అడ్డగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Karnataka Polls: పోలింగ్ మధ్యలో పొట్లాట.. మంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ

Karnataka Polls: ఉత్తర మంగళూరు జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థి బీఏ మొహియుద్దీన్ బావ మద్దతుదారులు మంగళవారం రాత్రి తమపై దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ బజ్పే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానికి కౌంటర్ ఫిర్యాదుగా జేడీఎస్ కార్యకర్తలు నమోదు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో నిజాం, హషర్‌ అనే ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‭కు పిలుపునిచ్చిన పీటీఐ

కాగా, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్‭లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కారును అడ్డగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Karnataka Elections 2023: బళ్లారిలో బాహాబాహీ .. చితక్కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

అనంతరం, రెండు గ్రూపులు బజ్పే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాయి. అక్కడ బావ మద్దతుదారులు నిజాం, హషేర్‌పై దాడి చేశారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిమీద ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఇదిలావుండగా బెల్తంగడిలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన బీజేపీకి చెందిన పట్టణ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జయానంద గౌడను పోలీసులు మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేశారు.