CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

CM KCR: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవన్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

CM KCR

CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో కేసీఆర్ మాట్లాడుతూ… వచ్చే కొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోవాలని మళ్లీ గెలవాలని అన్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని చెప్పారు. తమ పార్టీ నేతలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని సున్నితంగా హెచ్చరించారు.

వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా.. పార్టీ కోసం కలిసి పని చేయాలని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. అందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా అధిష్ఠానంతో విన్నవించుకోవాలని అన్నారు. దాహం వేసినప్పుడు బావి తవ్వాలంటే అది కాని పని అని కేసీఆర్ చెప్పారు.

కాగా, తెలంగాణ ఏర్పడ్డాక అనేక రాష్ట్రాల మోడల్స్ ను తెప్పించానని, రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని ఆలోచించామని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం మనకన్నా తక్కువ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును వెనకేసిందని చెప్పారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని అన్నారు. భారత్ ను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నామని తెలిపారు.

పోరాటాలతో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో నిరూపించామని కేసీఆర్ చెప్పారు. పంటల సాగుపై అధికారులు రైతులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అక్కడి సర్కారుకి విజన్ లేదని విమర్శించారు. తలసరి విద్యుత్ వాడంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని కేసీఆర్ చెప్పారు.

BRS Party Resolutions: దేశవ్యాప్తంగా దళితబంధు.. బీఆర్ఎస్ కీలక తీర్మానాలు ఇవే..