CM KCR : నేడు మల్లన్నసాగర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.

CM KCR : నేడు మల్లన్నసాగర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Mallanna Sagar

Mallanna sagar project : తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు నీటి సరఫరాతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ రిజర్వాయర్‌ కీలకం కానుంది. భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. తక్కువ కాలంలోనే పూర్తి చేసిన ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్‌ మోటార్లను సీఎం కేసీఆర్‌ ఆన్‌ చేయనున్నారు.

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌కు చేరిన గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. దీంతో తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా మల్లన్నసాగర్‌పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌తో మేలు జరగనుంది.

CM KCR assembly : గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నర వేల ఇళ్లు నిర్మిస్తున్నాం : సీఎం కేసీఆర్

మంగళవారం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద ప్రాజెక్ట్ మల్లన్నసాగర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నదిలేని చోట ప్రాజెక్ట్ నిర్మాణం చేశామన్నారు. ఇక్కడి నుండి 10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నదికే కొత్తనడక నేర్పారని మంత్రి చెప్పారు. 90 మీటర్లు ప్రవహించే నదిని 557 మీటర్ల ఎత్తుకు తేవడం జరిగిందన్నారు. భూసేకరణ సమయంలో ప్రాజెక్ట్ కోసం కాదు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ కి కొమరవెళ్లి మల్లన్న సాగర్ పేరు పెట్టుకున్నామని చెప్పారు.

20 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 16 టీఎంసీలు పరిశ్రమలకు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. నిర్వాసితుల త్యాగాలు గొప్పవని హరీష్ అన్నారు. సింగూరు, నిజాంసాగర్, గాంపూర్ కు మల్లన్న సాగర్ నుండి నీరు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చాలా కష్టపడ్డారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు. బీజేపీ నాయకులు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తం పారించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీళ్లు పారిస్తే, బీజేపీ నాయకులు రక్తం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండాకాలం ఉండేదని హరీశ్ వాపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా వానాకాలం లాగానే కనబడుతోందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ మీద కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారని చెప్పారు.

బీజేపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి జాతీయ ఓదా తీసుకొస్తే… దండలు వేస్తామని హరీశ్ అన్నారు. పాలమూరు ఘోష ఎలా తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తే, మీదేమో పాకిస్తాన్ గోస అని మండిపడ్డారు. మల్లన్నసాగర్ సగం తెలంగాణకు నీరును అందిస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ వందేళ్ల ముందుకు ఆలోచన చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని మంత్రి హరీశ్ వెల్లడించారు