CM KCR: మహా సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..

CM KCR: మహా సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

Cm Kcr

CM KCR: ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్ ఠాకరేను కలిశారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా తెలంగాణ సీఎం వ్యూహ రచన చేస్తున్నారు.

‘రాజకీయాలు, దేశాభివృద్ధి గురించి మాట్లాడేందుకు మహారాష్ట్ర వచ్చా. ఉద్ధవ్ తో మాట్లాడటాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నా. సోదర సమానులు. చాలా విషయాలు చర్చించాం. దేశంలో ఉన్న మా లాంటి వాళ్లను చాలా మందిని త్వరలోనే కలవబోతున్నాం. హైదరాబాద్ లో కూర్చొని, లేదంటే మరెక్కడైనా ఇంకొన్ని చర్చించాల్సి ఉంది’ అని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ఠాకరే మాట్లాడుతూ.. ‘దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. హిందూత్వ వాదన అది కాదు. ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్ ఏంటి. ఎవరైనా సీఎం, పీఎం అవగలరు. దేశ భవిష్యత్ గురించే చర్చించాం’ అని ఠాకరే అన్నారు.

Read Also : ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్.. స్పెషల్ అట్రాక్షన్ ప్రకాష్ రాజ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్వాగతం చెప్తూ.. ముంబైలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్, ఠాకరే, పవార్, శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాకరేలతో ఫ్లెక్సీలు కనిపించాయి.

గత వారమే తెలంగాణ సీఎం కార్యాలయానికి ఠాకరే నుంచి ఆహ్వానం అందిందని వెల్లడించింది. బీజీపే పాలసీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలపై మాట్లాడేందుకు సపోర్ట్ ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మీటింగ్ కు కూతురు కవితతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ కలిసి ముంబై పర్యటనకు వెళ్లారు.