Gujarat Muslim MLA : గుజరాత్ లో గెలిచిన ఎకైక ముస్లిం ఎమ్మెల్యే.. ఏ పార్టీ నుంచో తెలుసా?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలా విజయం సాధించారు. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉంండేవారు.

Gujarat Muslim MLA : గుజరాత్ లో గెలిచిన ఎకైక ముస్లిం ఎమ్మెల్యే.. ఏ పార్టీ నుంచో తెలుసా?

Muslim MLA Imran Khedawala

Gujarat Muslim MLA : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలా విజయం సాధించారు. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉంండేవారు. గెలిచిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. కానీ ఈసారి కేవలం ఇమ్రాన్ ఖేడావాలా ఒక్కరే గెలుపొందారు.

అహ్మదాబాద్ సిటీలోని జమాల్ పుర్-ఖేడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 13000 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు అభ్యర్థులను పోటీలో ఉంచింది. టిలో ముగ్గు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గుజరాత్ జనాభాలో ముస్లింలు 10 శాతం ఉంటారు. దరియాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గయాసుద్దిన్ షేక్, వానాకేర్ నుంచి జావెద్ పిర్జాదాలు ఓడిపోయారు.

AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది. వీరు జమాల్ పూర్-ఖేడియా, దరియాపూర్, జాంబుసార్ నుంచి పోటీ చేశారు. కానీ ఒక్కరు కూడా గెలవలేదు. బీజేపీ ఒక ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. మజ్లిస్ పార్టీకి చెందిన 12 మంది పోటీ చేయగా ఒక్కరు కూడా గెలవలేదు.