Priyanka Gandhi : అగ్నిపథ్ ఆర్మీని అంతం చేస్తుంది : ప్రియాంక గాంధీ

యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.

Priyanka Gandhi : అగ్నిపథ్ ఆర్మీని అంతం చేస్తుంది : ప్రియాంక గాంధీ

Priyanka

Priyanka Gandhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం యువతకు వ్యతిరేకమని, ఆర్మీని అంతం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. అగ్నిపథ్‌ పథకం అనేది సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానం. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ’ పేరుతో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొని, ప్రసంగించారు.

అగ్నిపథ్‌ పథకం దేశంలోని యువతకు వ్యతిరేకమని, ఆర్మీని అంతం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీని గద్దె దించి దేశ ఆస్తులను కాపాడే ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు.

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని మోదీ ఉప‌సంహ‌రించుకుంటారు: రాహుల్ గాంధీ

యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు. శాంతియుతంగా కొనసాగించాలని యువతకు పిలుపునిచ్చారు. సత్య మార్గంలో నడవడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడమే యువత లక్ష్యమన్నారు.

నిజమైన దేశభక్తిని చాటే, దేశ వనరులను సురక్షితంగా ఉంచే పేదలు, యువతను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా పోరాటం, నిరసన చేస్తున్న వారికి కాంగ్రెస్‌ కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.