Kerala Issue : ధర్నాలతో ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారన్న స్టార్ యాక్టర్.. కక్ష కట్టిన కాంగ్రెస్

జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంగా కూర్చొని ధర్నాకి దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనదారులు కొన్ని గంటల పాటు యాతన అనుభవించారు.

Kerala Issue : ధర్నాలతో ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారన్న స్టార్ యాక్టర్.. కక్ష కట్టిన కాంగ్రెస్

Kerala Issue

Kerala Issue :  ఇటీవల కొద్ది రోజుల క్రితం పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా నవంబర్‌ 1న కేరళ కొచ్చిలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది. వైట్టిల-ఎడపల్లి జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంగా కూర్చొని ధర్నాకి దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనదారులు కొన్ని గంటల పాటు యాతన అనుభవించారు.

Bigg Boss 5 : మరోసారి నామినేషన్స్ గొడవ.. ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్లోనే

అయితే ఇదే ట్రాఫిక్ లో మలయాళ ప్రముఖ నటుడు జోజు జార్జ్ కూడా ఇరుక్కుపోయాడు. అదే సమయంలో ఓ మహిళ తన కూతురిని కీమోథెరపికి తీసుకువెళ్లాలని వాహనాలకు అనుమతి ఇవ్వండని బతిమాలింది. అయినా కాంగ్రెస్ నాయకులు వినకపోవడంతో ఆ మహిళ తరపున నటుడు జాజు జార్జ్ కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగాడు. ఇలా రోడ్డుకు అడ్డంగా ఉండి ప్రజలకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారని గట్టిగా అడగడంతో కాంగ్రెస్ నాయకులు జార్జ్ కారు అద్దాలను పగులగొట్టారు. దీంతో జార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TFCC Elections : ఏకగ్రీవంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జోజు జార్జ్ ని టార్గెట్ చేశారు. తమ పార్టీ మహిళా కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడని, వీధి రౌడీలా ప్రవర్తించాడని, అతడిని శిక్షించాలని కేరళ పీసీసీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జోజు జార్జ్‌నే కాక సినీ పరిశ్రమను కూడా కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేసింది. సినిమా షూటింగ్స్‌ వద్ద హడావుడి చే​స్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. త్రిసూర్ జిల్లాలోని మాలా గ్రామంలో ఉన్న జార్జి ఇంటి ముందు కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.

Samantha : ‘ఖతిజా’గా సమంత.. సమంతలో మరో కొత్తకోణం

ఈ చర్యలతో కాంగ్రెస్ ని అందరు విమర్శిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించి కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో సినిమా షూటింగులను అడ్డుకుంటే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. అలాగే అతడి సన్నిహితులు, గ్రామస్థులు జార్జి ఎంతో మంచివాడు, అతని తప్పు లేకుండా కాంగ్రెస్ నాయకులు అతన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమి బాగోలేదని అంటున్నారు. ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఉన్నికృష్ణన్ కాంగ్రెస్ నేత సతీషన్‌కు లేఖ కూడా రాశారు. మరో పక్క సోషల్ మీడియాలో కూడా జార్జ్ కి సపోర్ట్ గా కాంగ్రెస్ ని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయినా తన వైపు తప్పు ఉండి కూడా కాంగ్రెస్ ఈ విషయాన్ని వదలట్లేదు.

Radheshyam first song : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ అద్భుతమైన లిరిక్స్…

జోజు జార్జ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని ఎర్నాకులం జిల్లా కాంగ్రెస్ కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు అన్నాడు. జార్జ్‌ కూడా నేనేమి తప్పు చేయలేదని, వాళ్లే ప్రజలకి ఇబ్బంది కలిగించారని నేను క్షమాపణ చెప్పనని అన్నారు.