Congress Party: సోనియా గాంధీతో గంటపాటు సమావేశమైన గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది

Congress Party: సోనియా గాంధీతో గంటపాటు సమావేశమైన గులాం నబీ ఆజాద్

Azad

Congress Party: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం అనంతరం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో అటు జాతీయస్థాయిలోనూ ఇటు ప్రాంతీయ స్థాయిలోను సంస్థాగత మార్పులు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే ప్రణాలికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది.

Also Read: PM Modi Hails Media: ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియా సానుకూల దృక్పధంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

దాదాపు గంటపాటు ఇద్దరు పలు కీలక అంశాలపై చర్చించారు. ఆజాద్ నేతృత్వంలోని G-23 కాంగ్రెస్‌ కోర్ గ్రూప్ సభ్యులు గురువారం జరిగిన సమావేశంలో పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్త పరిచిన నేపథ్యంలో నేటి వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా గాంధీని కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలితో సుదీర్ఘ భేటీ జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారని, ఈ విషయాన్ని పార్టీ నేతలంతా అంగీకరిస్తున్నారని ఆజాద్ తెలిపారు.

Also read: Bhagavad Gita: “భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు.. అందరిదీ”