PM Modi Hails Media: ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియా సానుకూల దృక్పధంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

స్వచ్ఛ్ భారత్ మిషన్, యోగా, ఫిట్‌నెస్, 'బేటీ బచావో బేటీ పఢావో' వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో "ఫోర్త్ ఎస్టేట్" సహకారంతో వ్యవహరించిందని ప్రధాని మోదీ అన్నారు

PM Modi Hails Media: ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియా సానుకూల దృక్పధంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Modi

PM Modi Hails Media: ప్రజల జీవితాలను మార్చడంలో మీడియా సానుకూల పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్, యోగా, ఫిట్‌నెస్ మరియు ‘బేటీ బచావో బేటీ పఢావో’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో “ఫోర్త్ ఎస్టేట్” సహకారంతో వ్యవహరించిందని ప్రధాని మోదీ అన్నారు. రాజకీయాలకు అతీతమైన ఇటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పనితీరు అభినందనీయమని ఆయన అనాన్రు. ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

Also read: BJP Janasena Government : ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమే-జీవీఎల్

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజల్లో మీడియా ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో నేను చూశాను. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఉదాహరణ అందరికీ తెలుసు. ప్రతి మీడియా సంస్థ ఈ మిషన్‌ను చాలా చిత్తశుద్ధితో చేపట్టింది”అని అన్నారు. యోగా, ఫిట్‌నెస్ మరియు ‘బేటీ బచావో బేటీ పఢావో’ వంటి కార్యక్రమాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో మీడియా కూడా చాలా ప్రోత్సాహకరమైన పాత్ర పోషించిందని, ఇవి రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతమైన అంశాలని ప్రధాని అన్నారు.

Also Read: World Happiest Country : ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశంగా మరోసారి టాప్ లో ఉన్న దేశం ఇదే!

రాబోయే రోజుల్లో మీడియా మెరుగైన సమాజం కోసం ఇంకా కృషిచేస్తుందని మోదీ ఆకాంక్షించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో భారత్ పై అంతర్జాతీయంగా అనేక అంశాల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయన్న మోదీ..వాటిని అందుకునేలా ప్రజలు ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ప్రధానితో పాటు ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వి మురళీధరన్, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పిఎ ముహమ్మద్ రియాస్‌తో సహా ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: The Kashmir Files: సినిమాలో ఒకవైపే చూపించారంటోన్న చత్తీస్‌గడ్ సీఎం