Covid-19 Cases: స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. 57వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

గడిచిన 24గంటల్లో దేశంలో కొవిడ్ - 19 కారణంగా 23మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,114 కు చేరుకుంది.

Covid-19 Cases: స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. 57వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

COVID-19 Testing

Covid-19 Cases: దేశంలో కొవిడ్ -19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత నెల రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 10,093గా నమోదైంది. అయితే, గత రెండు రోజులతో పోల్చితే రోజువారి కేసుల సంఖ్య స్వల్పగా తగ్గింది. శుక్రవారం 11వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, శనివారం 10,753 కొత్తకేసులు నమోదయ్యాయి. ఆదివారం వాటి సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఆదివారం ఉదయం వరకు 57,542 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసులలో 0.13శాతం.

covid-19 Cases : దేశంలో 50వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య .. ఒకేరోజు 27 మంది మృతి

గడిచిన 24గంటల్లో కొవిడ్ కారణంగా 23మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,114 కు చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంకు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా కొవిడ్ -19 రికవరీ రేటు 98.68శాతంగా నమోదైంది. 24గంటల్లో 6,248 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,29,459కి పెరిగింది.

COVID-19 Cases: శుభవార్తే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..! భారత్‌లో వచ్చే పది రోజులు కోవిడ్ ఉద్ధృతి.. ఆ తరువాత..

ముఖ్యంగా ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ఢిల్లీలో 1,396 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 నెలల తరువాత అత్యధికం. ఇదిలాఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో 1,79,853 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 807 వ్యాక్సిన్ లను అందించారు. జాతీయ టీకా డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.