Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా

కొవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ నిర్వహించారు.

Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా

Vaccine 11zon 1

Updated On : June 24, 2022 / 8:36 AM IST

Covid Vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో “అధిక” మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా COVID-19 వ్యాక్సిన్‌లు మహమ్మారి సమయంలో కొవిడ్ మృతుల సంఖ్యను సంవత్సరంలో సగానికి పైగా తగ్గించాయని స్టడీలో తెలిసింది. కనుగొంది.

వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి సంవత్సరంలో, 185 దేశాలు, భూభాగాల్లో నమోదైన అదనపు మరణాల ఆధారంగా వేసిన అంచనాల్లో ప్రపంచవ్యాప్తంగా 31.4 మిలియన్ల కొవిడ్ మరణాలు అంచనా వేస్తే.. అవి 19.8 మిలియన్ల వరకూ నిరోధించగలిగారని రీసెర్చర్లు తెలిపారు.

Read Also: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. ఇండియాలో తొలిసారి

దీంతో 2021 చివరి నాటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులతో ప్రతి దేశపు జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఈ లక్ష్యం నెరవేరితే మరో 5లక్షల 99వేల 300 మంది ప్రాణాలు కాపాడొచ్చని స్టడీ అంచనా వేసింది.

డిసెంబరు 8, 2020 నుంచి డిసెంబర్ 8, 2021వరకూ ఆపగలిగిన కరోనా మరణాల సంఖ్యను స్టడీ అంచనా వేసింది. “భారతదేశంలో, ఈ కాలంలో టీకా ద్వారా 42లక్షల 10వేల మరణాలు ఆపగలిగామని అంచనా వేస్తున్నట్లు స్టడీ తెలిపింది. ఈ అంచనాలో అనిశ్చితి 36,65,000-43,70,000 మధ్య ఉం