Covid-19: వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ రద్దు అంటూ మెసేజ్‌లు

మే 1 తేదీ నుండి 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. టీకాకోసం రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Covid-19: వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ రద్దు అంటూ మెసేజ్‌లు

Covid 19 (2)

Covid-19: మే 1 తేదీ నుండి 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. టీకాకోసం రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి రద్దైనట్లుగా సందేశాలు వస్తున్నాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో పలువురికి ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి. ఒకసారి రిజిస్ట్రేషన్‌ కోసం ఎంతో సమయం పడుతోందని, తీరా రిజిస్ట్రేషన్‌ చేస్తే ఇలా మెసేజ్‌ రావడం ఏంటని అంటున్నారు. మెసేజ్‌ వచ్చిన వారిలో కొందరు మరలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే టీకా కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి పరిమిత సంఖ్యలో టీకా ఇస్తున్నారు.

రెండో డోస్ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో వైపు కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల పెరుగుదల తీవ్రంగానే ఉంది