Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే

తాజాగా కాలుష్య నియంత్రణకు మరో నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని భారీ, కమర్షియల్ వాహనాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి 2023 ఫిబ్రవరి నెల చివరి వరకు భారీ వాహనాల్ని అనుమతించరు. భారీ వాహనాలు అన్నీ డీజిల్ వాహనాలే అయ్యుంటాయి.

Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే

Delhi Entry Ban

Delhi Entry Ban: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులోనూ చలికాలంలో ఈ కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటుంది. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. దీనిలో భాగంగా గతంలో సరి, బేసి విధానం ప్రకటించింది. అంటే వాహనం నెంబర్ సరి సంఖ్య అయితే ఒక రోజు, బేసి సంఖ్య అయితే మరో రోజు రోడ్డు మీదికి అనుమతిస్తారు.

Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఇది కొంతమేర సత్ఫలితాల్ని ఇచ్చింది. తాజాగా కాలుష్య నియంత్రణకు మరో నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని భారీ, కమర్షియల్ వాహనాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి 2023 ఫిబ్రవరి నెల చివరి వరకు భారీ వాహనాల్ని అనుమతించరు. భారీ వాహనాలు అన్నీ డీజిల్ వాహనాలే అయ్యుంటాయి. కాలుష్యం తగ్గాలంటే వీటిని అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండేది. అప్పట్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో 15-20 రోజులు మాత్రమే ఈ వాహనాలపై నిషేధం విధించేవారు. అయితే, పెరుగుతున్న కాలుష్యాన్నిబట్టి, ఇప్పుడు దాదాపు ఐదు నెలలు వాహనాలపై నిషేధం విధించాలనుకుంటున్నారు.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

తాజా అంచనా ప్రకారం ప్రతి రోజు ఢిల్లీ నగరంలోకి దాదాపు 75,000 ట్రక్కులు ప్రవేశిస్తాయి. వీటి వల్ల భారీ స్థాయిలో పొగ విడుదలవుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ఈ ట్రక్కులే ప్రధాన కారణం. దీంతో వీటిపై నిషేధం కొనసాగనుంది. మరోవైపు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ఎలాంటి నిషేధం ఉండబోదని ఢిల్లీ రవాణా శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై ట్రక్కులు, లారీల ఓనర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.