Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?

కారు తుడుస్తున్నట్లు నటించిన ఆ పిల్లాడు, నిజంగానే డబ్బులు కొట్టేశాడేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదంటోంది ఫాస్టాగ్. దీనికి సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా క్లారిటీ ఇస్తూ ఒక సర్క్యులర్ విడుదల చేసింది.

Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?

Fastag

Fastag: ఫాస్టాగ్ స్కామ్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కార్ ముందు అద్దం తుడుస్తున్న ఒక పిల్లాడు, తన స్మార్ట్ వాచ్ ఉపయోగించి, ఫాస్టాగ్‌లో ఉన్నడబ్బులు మొత్తాన్ని తన అకౌంటులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు అన్నది ఆ వీడియో సారాంశం.

Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ

కారు తుడుస్తున్నట్లు నటించిన ఆ పిల్లాడు, నిజంగానే డబ్బులు కొట్టేశాడేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదంటోంది ఫాస్టాగ్. దీనికి సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా క్లారిటీ ఇస్తూ ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అలా డబ్బులు కొట్టేయవచ్చు అన్న ప్రచారం ఉట్టిదేనని ఆ సర్క్యులర్ ద్వారా వివరించింది. దీని ప్రకారం.. ఫాస్టాగ్ పేమెంట్స్ నాలుగు మోడల్స్‌లో మాత్రమే పనిచేస్తాయి. ఎన్పీసీఐ, జారీ చేసే బ్యాంకు, మనీ రిసీవ్ చేసుకునే బ్యాంకు, టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఫాస్టాగ్ పనిచేస్తాయి. వీటి ఆధారంగా ఫాస్టాగ్ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎమ్) విధానంలోనే పనిచేస్తుంది. పర్సన్ టు పర్సన్ (పీ2పీ) పద్ధతిలో పనిచేయదు.

PM Modi: జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ

అందువల్ల ఏ వ్యక్తులూ ఫాస్టాగ్ ఉపయోగించి డబ్బులు కొట్టేయలేరు. ప్రత్యేకంగా అనుమతించిన ప్లాజాల దగ్గర మాత్రమే ఇవి పనిచేస్తాయి. అనుమతించిన ఐపీ అడ్రస్, యూఆర్ఎల్ లింకుల ద్వారా మాత్రమే ఫాస్టాగ్ సేవలు పనిచేస్తాయి. ఫాస్టాగ్ వసూలు చేసే మర్చంట్స్‌కు సంబంధించిన జియో లొకేషన్ వివరాల్ని కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల అనుమతి లేని చోట ఫాస్టాగ్ పనిచేయదు. ఇతరులు ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కాజేశారు అనేది ఉత్త ప్రచారం మాత్రమే.