Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ .. స్వల్ప ఆధిక్యంలో ఆప్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.

Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ .. స్వల్ప ఆధిక్యంలో ఆప్

Delhi MCD Elections

Delhi MCD Elections: ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఫలితాలు వెలువడుతున్నా కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. ఉదయం 11గంటల సమయానికి 20 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించగా, 25స్థానా ల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు, ఇతరులు ఒక్క స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆప్ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాల్లో, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతున్నారు.

MCD elections: ఆప్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.. దాడి చేసి తరిమికొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 1349 మంది అభ్యర్థుల తమ భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. భారీ భద్రత మధ్య ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడుతాయని అధికారులు తెలిపారు.

MCD Elections: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా

ఈ ఫలితాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. బీజేపీ మొత్తం 103 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆప్ 131 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక కాంగ్రెస్ 11, ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ మున్సిపాలిటీ 1958లో ఏర్పాటైంది. ఎంసీడీని 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్దరించారు. ఇది మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఇదిలాఉంటే ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగా ఫలితాలు ఉండకపోవచ్చని స్పష్టమవుతుంది. నాలుగు ఎగ్జిట్ పోల్స్ మొత్తం 115 వార్డుల్లో ఆప్ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ మాత్రం 84, కాంగ్రెస్ కు 7 సీట్లు వస్తాయని తెలిపింది.