Dengue Fever: హైదరాబాద్‌లో చాపకింద నీరులా డెంగ్యూ

కరోనా వైరస్‌తో కకలావికలం అవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధి డెంగ్యూ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోవడంతో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.

Dengue Fever: హైదరాబాద్‌లో చాపకింద నీరులా డెంగ్యూ

Dengue fever cases rise in Hyderabad

Dengue Fever: కరోనా వైరస్‌తో కకలావికలం అవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధి డెంగ్యూ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోవడంతో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. చాప కింద నీరులా హైదరాబాద్‌లో డెంగ్యూ వ్యాపిస్తోందని, ఫీవర్‌ హాస్పిటల్‌లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేవలం ఒక్క హాస్పిటల్‌లో ఒకే రోజులో 50 కేసులు నమోదయ్యాయంటే.. నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి తగ్గక ముందే.. డెంగ్యూ వ్యాపిస్తుండటం ఆందోళనకరంగా ఉందంటూ చెబుతున్నారు డాక్టర్లు.

డెంగ్యూ వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ఇది దోమల వల్ల వ్యాపించే వ్యాది కాబట్టి.. దోమ కాట్ల నుంచి ఎవరిని వారు కాపాడుకోవాలంటున్నారు. ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో కూలర్లు, వాటర్‌ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇంటి పరిసరాలు, డ్రైన్లు కూడా క్లీన్‌గా ఉంచుకోవడం మంచిదంటున్నారు. డెంగ్యూ సోకినట్టు ఏమాత్రం అనుమానంగా ఉన్నా.. వెంటనే టెస్టులు చేయించుకోవాలంటున్నారు.

ఇక ఈ సీజన్‌లో కరోనా ఎక్కువగా వ్యాపించే అకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. వేరియంట్‌ ఏదైనా అల్టిమేట్‌గా మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుందంటున్నారు. మరో నెల రోజుల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. భౌతిక దూరం పాటించాలంటున్నారు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తుల్లో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.