Lime Cultivation : ఎలాంటి నేలలు నిమ్మసాగుకు అనుకూలమో తెలుసా!..

గాలిలో తేమ తక్కువగా ఉండి పొడివాతావరణం కలిగిన నేలల్లో నిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగు అంతమంచిదికాదు.

Lime Cultivation : ఎలాంటి నేలలు నిమ్మసాగుకు అనుకూలమో తెలుసా!..

Neem

Lime Cultivation : కరోనా పరిస్ధితుల నేపధ్యంలో నిమ్మపండ్లకు బాగా గిరాకీ పెరిగింది. ఇది రైతులకు అధిక అదాయాన్ని సమకూర్చి పెట్టే పంటగా మారటంతో , అధికశాతం మంది రైతులు నిమ్మసాగువైపు దృష్టిసారిస్తున్నారు. 10అడుగుల వరకకు దట్టంగా పెరిగి ముళ్ళతో కూడిన కొమ్మలను నిమ్మమొక్కలు కలిగి ఉంటాయి. పుల్లటి రుచికలిగి ఉండే ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.

నిమ్మసాగు చేపట్టాలను కుంటున్న రైతులు ముందుగా ఈ పంట వేసేందుకు ఎలాంటి నేలలు అనుకూలమో తెలుసుకోవటం మంచిది. నిమ్మపంటల సాగుకు ఎర్రనేలలు, నీరు నిల్వ ఉండని ఎత్తైన గరప ఎర్రనేలల్లో పెంచుకోవచ్చు. నేలలోని పిహెచ్ సి 6.5 నుండి 7.5వరకు ఉండాలి. సున్నపురాళ్ళు, రాతిపొరలు, నీరు ఇంకని నెలలు నిమ్మసాగుకు ఏమాత్రం అనుకూలంకాదు. ఇలాంటి నేలల్లో నిమ్మసాగు చేపడితే త్వరగా తెగుళ్ళు వ్యాపించి పంట దెబ్బతుంది.

గాలిలో తేమ తక్కువగా ఉండి పొడివాతావరణం కలిగిన నేలల్లో నిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగు అంతమంచిదికాదు. వాతావరణ పరిస్ధితులు అనుకూలంగా లేకపోతే, పూత, కాత దశలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 750 మిల్లీ మీటర్ల వర్షపాతం, నీటి అధారం ఉన్న భూముల్లో నిమ్మసాగుకు అనుకూలం.

ఎకరాకు 160 మొక్కలు వరకు నాటుకోవచ్చు. ముందుగా బెడ్ లపై పాలిథిన్ సంచుల్లో విత్తనాలు నాటి మొక్కలు పెంచాలి. రెండు మసాలకే మొక్కలు పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతాయి. 5నెలల సమయంలో అంటుకట్టుకునే ప్రక్రియను చేపట్టాలి. దక్షిణ భారత దేశ ప్రాంతాల్లో నిమ్మపంట ఏడాది పొడవునా వస్తుంది. మూడు సీజన్లలో పూత వస్తుంది. మార్కెట్లు పరిస్ధితులను బట్టి పంటకు ఏసీజన్ లో డిమాండ్ లభిస్తుందో ముందే తెలుసుకుని దానిని బట్టి పూత నిలుపుకుని కాతకు వెళ్ళటం మంచిది. తద్వారా మంచి అదాయం సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.