Jharkhand Rope way: ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యు ఒడికి: సహాయక చర్యల్లో హెలికాప్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కేబుల్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి..మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. క్షణ కాలంలో జరిగిన ఈ పొరబాటుతో సహాయక బృందాలు సైతం షాక్ కి గురయ్యారు

Jharkhand Rope way: ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యు ఒడికి: సహాయక చర్యల్లో హెలికాప్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

Trikut

Jharkhand Rope way: ఝార్ఖండ్ లోని దేవగఢ్ జిల్లా త్రికూట్ పర్వతాల్లో జరిగిన రోప్ వే ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాద స్థలికి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో..హెలికాఫ్టర్ల ద్వారా నెమ్మదిగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్లు, విపత్తు నిర్వహణశాఖ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న పర్యాటకులను రక్షిస్తున్న సమయంలో పొరబాటు చోటుచేసుకుంది. సహాయక చర్యల్లో భాగంగా కేబుల్ కారులో చిక్కుకున్న ఓ వ్యక్తిని హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్న సమయంలో పట్టు కోల్పోవడంతో ఆవ్యక్తి జారీ కింద పడ్డాడు. హెలికాప్టర్ డోర్ దాకా వెళ్లిన ఆ వ్యక్తి..హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చిన బలమైన గాలుల ధాటికి ఒక్క ఉదుటున జారిపడ్డాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఒకే ఒక్క క్షణం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఒక నిండు ప్రాణం నిలబడేదని స్థానికులు పేర్కొన్నారు.

Also read:Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం

కేబుల్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి..మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. క్షణ కాలంలో జరిగిన ఈ పొరబాటుతో సహాయక బృందాలు సైతం షాక్ కి గురయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా పర్వతంపై నున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించుకునేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే సాంకేతిక తప్పిదంతో రోప్ వేపై రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో డజను మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో రోప్ వేపై ఇతర కేబుల్ కార్లలో ఉన్న సుమారు 50 మంది పర్యాటకులు 24 గంటలుగా ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. పర్యాటకులను రక్షించేందుకు సోమవారం ఉదయం నుంచి ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.

Also read:Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం-ఏడుగురు అరెస్ట్