IPL: ఐపీఎల్ వేలం.. ఒక బాల్‌కు రూ.49 లక్షల ఆదాయం

ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.

IPL: ఐపీఎల్ వేలం.. ఒక బాల్‌కు రూ.49 లక్షల ఆదాయం

Ipl

IPL: ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంతో బీసీసీఐకి కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 2023-2027 వరకు ఐపీఎల్ శాటిలైట్, డిజిటల్ ప్రసార హక్కుల కోసం వేలం నిర్వహించగా దాదాపు రూ.48,390 కోట్ల ధర పలికాయి. తాజాగా జరిగిన వేలంలో బీసీసీఐకి దాదాపు రూ.48,390 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

HIV-AIDS: హెచ్ఐవీకి చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు

ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే ఒక ఓవర్‌కు రూ.2.95 కోట్లు, ఒక బాల్‌కు దాదాపు రూ.49 లక్షల ఆదాయం బీసీసీఐ సొంతం కానుంది. ఇంతకుముందు ఈ హక్కులు స్టార్ ఇండియా గ్రూప్ కలిగి ఉంది. ఈ సంస్థ 2018-22 వరకు దాదాపు రూ.6,138 కోట్లు చెల్లించి హక్కులు సొంతం చేసుకుంది. దీని ప్రకారం బీసీసీఐకి ఒక మ్యాచుకు రూ.55-60 కోట్ల ఆదాయం సమకూరింది.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

తాజాగా జరిగిన వేలంలో దీనికి దాదాపు రెట్టింపు ఆదాయం బీసీసీఐ సొంతమైంది. ఈ సారి టెలివిజన్ హక్కులను డిస్నీ-స్టార్ గ్రూపు దక్కించుకోగా, డిజిటల్ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఇంతకుముందు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి విక్రయించేది. ఈ సారి మాత్రం రెండింటినీ వేర్వేరుగా విక్రయించింది. అది కూడా ఇ-వేలం ద్వారా కావడం గమనార్హం.