Chikoti Praveen : సినీ పరిశ్రమకి పాకిన చికోటి సంచలనం.. హీరోయిన్స్ పై ఈడీ దృష్టి??

ఇప్పటికే రాజకీయాల్లో సంచలనంగా మారిన చికోటి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమకి పాకింది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించారని.........

Chikoti Praveen : సినీ పరిశ్రమకి పాకిన చికోటి సంచలనం.. హీరోయిన్స్ పై ఈడీ దృష్టి??

Chikoti Praveen

Updated On : July 29, 2022 / 7:48 AM IST

Chikoti Praveen :  క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ కుమార్‌‌ గత రెండు రోజుల నుంచి సంచలనంగా మారారు. ఈడీ చికోటి ప్రవీణ్ తో పాటు పలువురిపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు కూడా సేకరించింది. రూల్స్ కి వ్యతిరేకంగా పని చేశారని, హవాలా లావాదేవీలు జరిపారని, క్యాసినోని అక్రమంగా నిర్వహిస్తున్నారని చికోటి ప్రవీణ్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు చికోటి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. పలు రాజకీయ నాయకులకు, ఇతనికి సంబంధం ఉన్నట్టు, అక్రమార్జన చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే రాజకీయాల్లో సంచలనంగా మారిన చికోటి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమకి పాకింది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించారని, ఇందుకు భారీ మొత్తం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఏయే సినీ తారలు ఉన్నారో ఆ లిస్ట్ ఈడీ దగ్గర ఉన్నట్టు సమాచారం. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించినందుకు మల్లికా షెరావత్‌కు రూ.కోటి, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్‌ హయతీకి రూ.40 లక్షలు, ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషికాలను చికోటి ఇచ్చినట్లు తెలుస్తుంది.

Ashwini Dutt : ముందు అలా.. తర్వాత ఇలా.. నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం..

 

అలాగే కొంతమంది బాలీవుడ్ తారలు గోవింద, ఆచార్య గణేష్.. లాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నట్టు వారికి కూడా డబ్బులు బాగానే చెల్లించినట్టు తెలుస్తుంది. అంతే కాక చిన్న రేంజ్ తారలు కూడా మరి కొంతమంది ఉన్నారు. దీంతో వీరి లావాదేవీలపై ఈడీ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్యాసినో వ్యవహారం సినీ పరిశ్రమలో ఏం సంచలనం చెలరేగిస్తుందో, ఈడీ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూడాలి.