PM Photo Co-WIN : ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. కొవిడ్ సర్టిఫికేట్లపై మళ్లీ ప్ర‌ధాని మోడీ ఫొటో..!

PM Photo Co-WIN : యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి కింద కొవిడ్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు.

PM Photo Co-WIN : ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. కొవిడ్ సర్టిఫికేట్లపై మళ్లీ ప్ర‌ధాని మోడీ ఫొటో..!

Pm Photo Co Win

PM Photo Co-WIN : యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి కింద కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను మినహాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ సర్టిఫికేట్లపై మోదీ ఫొటోలను తిరిగి ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ మణిపూర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జనవరి 8న టీకా సర్టిఫికెట్ల నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు.

ఈ రాష్ట్రాల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లపై ప్రధాని ఫొటో ముద్రణను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇస్తున్న COVID-19 సర్టిఫికేట్‌లలో ప్రధానమంత్రి ఫొటోను తిరిగి చేర్చడానికి కో-విన్ ప్లాట్‌ఫారమ్‌లో అవసరమైన మార్పులు చేయనున్నట్టు నివేదిక పేర్కొంది.

భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను మొత్తం 113 దేశాలు ఆమోదించాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్‌తో పరస్పర గుర్తింపు ధృవీకరణ పత్రాల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. మరికొన్ని తమ సొంత ప్రోటోకాల్‌లను కలిగి ఉన్నాయని, తద్వారా టీకాలు వేసిన ప్రయాణికులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం డిసెంబర్ 2021లో రాజ్యసభకు తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 182.87 కోట్లు దాటింది.

2,16,75,657 సెషన్ల ద్వారా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల వరకు అందిన డేటాలో శుక్రవారం నాటికి 29,07,479 డోసులను అందించింది కేంద్రం. 12ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకూ 1.07 కోట్ల మంది యుక్తవయస్సు వారికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు అందుకున్నట్టు డేటా వెల్లడించింది.

Read Also : Delhi Rozgar Budget 2022 : ఢిల్లీలో వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం : కేజ్రీవాల్ సర్కార్ టార్గెట్!