1st Dose Vaccine : 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తి

దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.

1st Dose Vaccine : 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తి

Vaccine (2)

1st Dose Vaccine దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, సిక్కిం, ఉత్తరాఖండ్, దాద్రా నగర్ హవేలీలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇక, దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 75 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నట్లు తెలిపారు. దేశంలోని దాదాపు 93 కోట్ల మంది వయోజనుల్లో 31 శాతానికి పైగా వ్యాక్సిన్ రెండు డోసులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు, కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 103.5 కోట్ల డోసులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఆ రాష్ట్రాల దగ్గర ఇంకా 10.85 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్లు పేర్కొంది. 100 కోట్ల డోసుల పంపిణీ గణతను గురువారం భారత్ అందుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసూ వేయించుకునేలా కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

ALSO READ Song On Vaccination : 100 కోట్లమందికి వ్యాక్సిన్ పై ప్రత్యేక గీతం,ఏవీ విడుదల