Etela Rajender: నాకు ఫ్రస్టేషన్ రాదు.. డ్రామాలు రావు: ఈటల రాజేందర్

Etela Rajender: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ సర్కారుపై పలు ఆరోపణలు గుప్పించారు.

Etela Rajender: నాకు ఫ్రస్టేషన్ రాదు.. డ్రామాలు రావు: ఈటల రాజేందర్

Etela Rajender

Etela Rajender: సీఎం కేసీఆర్ సర్కారుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మండిపడ్డారు. తనకు ఫ్రస్టేషన్ రాదని, డ్రామాలు రావని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవేళ హుజూరాబాద్ లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన కూడా.. అందరినీ చల్లగా చూసే బాధ్యత తనదని అన్నారు. కొన్ని వేలమంది ప్రతి రోజూ బీజేపీ చేరుతున్నారని అన్నారు. చేరికలు బీజేపీలో మాత్రమే ఉన్నాయని చెప్పారు.

“కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మి అభివృద్ధి చేస్తున్నారా? హుజూరాబాద్ ప్రజలు పన్ను కట్టడం లేదా? కేసీఆర్ కి పాలించే నైతిక హక్కు లేదు. ప్రతిపక్షాల నాయకుల గొంతు నొక్కుతున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరా గాంధీకి కూడా దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఓడిపోయిన వాడు పైకి వచ్చిండు, గెలిచిన వాడిని కింద పడేస్తున్నారు. చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తున్నారు.

మానెరు వాగులో ఇసుక తవ్వకాలు ఆగకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. ధరణిపై హైకోర్టు కామెంట్స్ ప్రభుత్వానికీ చెంపపెట్టు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. కేసీఆర్ కి రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవు. గతంలో ప్రభుత్వ నిర్ణయాలు అధికారులతో చర్చించి తీసుకునేవారు.

కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు అధికారులు ఎవరితో చర్చించకుండా, నిబంధనలు పాటించకుండా సిస్టం లేకుండా తాను చెప్పింది వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం చెప్పగానే జీవోలు ఇస్తున్నారు. ఎల్ఎండీ (LMD) కింద ఇసుక వచ్చే ఆస్కారమే లేదు. కానీ మానేరు వాగును చెరబట్టారు.

ముఖ్యమంత్రి గారి సడ్డకుడు రవీందర్ రావు ఒక ఆంధ్ర కాంట్రాక్టరును తీసుకువచ్చి మానేరు వాగులో ఇసుక కాంట్రాక్టు ఇప్పించారు. చుట్టుపక్కల ఉన్న బోర్లు బావులు ఎండిపోయాయి. రేపు స్థానిక అవసరాల కోసం ఇసుక లేకుండా అయిపోయింది. పంట సీజన్ వస్తుందంటే ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించి సివిల్ సప్లై శాఖను సిద్ధం చేస్తుంది. కానీ అది కెసిఆర్ ప్రభుత్వం లో జరగదు.

వారాల తరబడి ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాకపోవటం వల్ల కళ్లాల్లో ధాన్యం పోసుకొని ఎదురుచూస్తున్న రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు వర్షం పాలైంది. టన్నుల కొద్దీ ధాన్యం కొట్టుకుపోయింది. వేల టన్నుల ధాన్యం తడిచిపోయింది. తడిచిన ధాన్యానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతి రైతు దగ్గర నుంచి ఒక్క గింజ లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మిల్లుల దగ్గర ధాన్యం వెంటనే దించుకునేలాగా చర్యలు తీసుకోవాలి” అని ఈటల రాజేందర్ చెప్పారు.

YS Sharmila: అందుకే వారిని తోసేశాను: వైఎస్ షర్మిల వ్యాఖ్యలు